రుతుక్రమం సమయంలోనే పెళ్లి చేసుకున్న యువతి..మహా పాపం చేశావ్ అంటూ..విడాకులు కోరిన భర్త

రుతుక్రమం సమయంలోనే పెళ్లి చేసుకున్న యువతి..మహా పాపం చేశావ్ అంటూ..విడాకులు కోరిన భర్త

Gujarat Vadodara man divorce as wife did not reveal about periods on wedding day : ‘బహిష్టు’ లేదా ’రుతుక్రమం’ సమయంలోనే వివాహం చేసుకుందో యువతి. తనను వివాహం చేసుకునే వరుడికి తెలియదు. ఆ విషయం వివాహం జరిగిన తరువాత భర్తకు ఆ విషయం చెప్పింది. దీంతో అతను పెద్ద రాద్దాంతం చేశాడు. ‘రుతుక్రమం’ సమయంలోనే పెళ్లి చేసుకుందనీ..పైగా తనకు ఆ విషయం విషయం చెప్పకుండా దాచిపెట్టి పెద్ద నేరం చేసిందనీ తమ ‘‘విశ్వాసాన్ని దెబ్బతీసిందని’’ ఈ విషయం తెలిసి తాను తన తల్లి షాక్ అయ్యామని నానా యాగీ చేశాడు. అంతటితో ఊరుకోకుండా ఏకంగా విడాకులు కోరిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోనే వడోదరాలో జరిగింది.

వడోదరాలకు చెందిన ఓయువకుడు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి గత జనవరిలో టీచర్ గా పనిచేసే ఓ యువతితో వివాహం జరిగింది. వధువు సరిగ్గా పెళ్లిరోజు వధువుగా ఉన్న ప్రస్తుత భార్య నెలసరిలో ఉండి వివహాం చేసుకుంది. ఆ విషయాన్ని వివామం జరిగిన తరువాత ప్రత్యేక పూజ కోసం ఓ దేవాలయంలోకి వెళ్లే కొద్ది క్షణాల ముందు తన భార్య తాను ‘బహిష్టు’లో ఉన్నానని చెప్పింది.

దాంతో అతను అతని తల్లి గొడవ చేశారు. పెళ్లిని అపవిత్రం (బహిష్టు) సమయంలో చేసుకోవటం చాలా చాలా పాపం అని అన్నారు. ఆ గొడవ సర్ధుమణగలేదు. విడాకుల వరకూ వెళ్లింది. రుతుక్రమంలోనే తనను పెళ్లి చేసుకుందని ఇది తమ విశ్వాసాలకు భంగం కలిగించే అత్యంత పెద్ద విషయం అని ఈ భార్య నాకొద్దు అంటూ విడాకులకు అప్లై చేశాడు. ఆ విషయం ఒక్కటే విడాకులు మంజూరు కోసం సరిపోదని సదరు భర్త వివాహం జరిగిన నాటి నుంచి అస్తమానం ఆమె తనతో ఏదో ఒక గొడవపెట్టకుని పుట్టింటికి వెళ్లిపోతుందని అతడు తన పిటిషన్‌లో ఆరోపించాడు.

కానీ ఆ యువతి మాత్రం ఇదో పెద్ద విషయమే కాదు..దీని కోసం విడాకులు కోరటమేంటంటూ ప్రశ్నిస్తోంది. అసలు విషయం తాను బహిష్టు సమయంలో వివాహం చేసుకున్నందుకు కాదనీ..తన వివాహం జరిగిన తరువాత కూడా టీచర్ గా పనిచేసే తన జీతంలోంచి తన అన్నకు ప్రతీ నెలా రూ.5వేలు ఇస్తున్నానని అందుకు తన భర్తా, అత్తింటివారి గొడవచేస్తున్నారని తెలిపింది. తన పెళ్లికి చేసిన ఖర్చులతో చాలా అప్పుల పాలయ్యాడని దానికి తన వంతుగా సహాయం చేయటానికి ప్రతీ నెలా రూ.5వేలు ఇస్తున్నానని ఆ విషయం తన భర్తకు., అత్తింటివారికి నచ్చగా ఇలా రుతుక్రమంలో పెళ్లి చేసుకున్నాననే వంకతో విడాకులు కోరుతున్నారంటూ వాపోయింది.

యువతులకు, మహిళలకు ప్రతీ నెలా రుతుక్రమం (నెలసరి లేదా బహిష్టు, లేదా ముట్టు) అనేది సర్వసాధారణం. ఇది ప్రకృతిపరంగా జరిగే ప్రక్రియ.ఆడవారికి శరీరంలో జరిగే అత్యంత సర్వసాధారణ ప్రక్రియ. కానీ రుతుక్రమం అంటే అంటరానిదిగా ఈనాటికీ చూస్తుంటారు. ఈ మూడు రోజులు అంటరానివారిగా చూస్తుంటారు. బైటకు కూడా చెప్పుకోరు.

చెప్పినా రహస్యంగా పలు విధాలుగా చెబుతుంటారు. స్నానం వచ్చిందనీ…స్నానం అయ్యిందని చెబుతుంటారు. కానీ బహిష్టు విషయంలో అపోహల్ని పోగొట్టేలా చాలా కార్యక్రమాలే జరుగుతున్నాయి. కానీ మార్పు మాత్రం రావటంలేదు. ‘రుతుక్రమం’ అనేది ఏదో పెద్ద రహస్యమైన విషయం కాదు తగిన శుభ్రతపాటిస్తు సాధారణ రోజులు కూడా అనే విషయంపై ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరముంది.