Valentine Day 2023 : ‘గుండెను బంగారు గులాబీలు’గా మార్చి భర్తకు బహుమతి..

‘గుండెను బంగారు గులాబీలు’గా మార్చి భర్తకు బహుమతి ఇచ్చిందో భార్య. మామూలు గులాబీలు అయితే వాడిపోతాయని మా ప్రేమలాగా ఈ బంగారు గులాబీలు వాడిపోవని చెబుతోందీ భార్యామణి.

Valentine Day 2023 : ‘గుండెను బంగారు గులాబీలు’గా మార్చి భర్తకు బహుమతి..

Surat Woman gifts 108 gold roses bouquet

Valentine Day 2023: ఓ భార్య తన భర్తకు అరుదైన..ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంది ప్రేమికుల దినోత్సం (ఫిబ్రవరి 14,2023)సందర్భంగా..ప్రేమకు చిహ్నంగా ఇచ్చి గులాబీ పువ్వు ఇస్తే కాసేపటికే వాడిపోతుంది. కానీ తమ ప్రేమలాగానే వాడిపోను పువ్వులివ్వాలని అనుకుంది.బాగా ఆలోచించింది. అంతే ‘గుండె’ఆకారంలో బంగారంతో గులాబీ పూలతో బొకే తయారు చేయించి భర్తకు బహుమతిగా ఇచ్చింది. 108 బంగారు పూలతో భర్తకు బహుమతి ఇచ్చింది గుజరాత్ కు చెందిన మహిళ.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన పరిధిబెన్‌ అనే మహిళ.. తన భర్త దీప్‌కు బంగారు పూత పూసిన 108 గులాబీలను హృదయం ఆకారంలో తయారు చేయించి మరీ బహుమతి ఇచ్చారు. ఈ ప్రత్యేక బహుమతి గురించి పరిధిబెన్ మాట్లాడుతూ ‘‘నిజమైన గులాబీలైతే వాడిపోతాయి. బంగారు పూత పూసిన ఈ గులాబీలు ఎప్పటికీ వాడిపోవు మా ప్రేమలాగా..బంగారు గులాబీలు ఎల్లకాలం మా ప్రేమకు గుర్తుగా ఉంటాయి’’ అని తెలిపారు. ప్రేమికులరోజున నా భర్తకు ఏదైనా కొత్తగా ఇవ్వాలని అనుకున్నాను అందుకే బంగారు పూత పూసిన గులాబీ పూలు ఇచ్చానని తెలిపారు. ఈ బంగారు పూత గులాబీలు తయారు చేయటానికి రూ.1.80 లక్షలు ఖర్చు పెట్టారు.

108 గులాబీల లెక్కేంటీ అనుకుంటున్నారా? దానికోలెక్క కూడా ఉందంటున్నారు బెన్. 108 సంఖ్య సంపూర్ణ ఐక్యతకు చిహ్నం అందుకే 108 పూలను చేయించానని తెలిపారు. తాను గతంలో వజ్రాలు కొనటానికి ఓ షాపుకు వెళ్లానని అక్కడ బంగారు పూలను చూశానని నా భర్తకు బంగారు పూలను బహుమతిగా ఇవ్వాలని అనుకున్నానని ఈ సంవత్సరం ప్రేమికుల దినోత్సం సందర్భంగా నా కోరిక నెరవేర్చుకున్నానని తెలిపారు.