Gujarati Singer : ఇదేం పిచ్చి..సింగర్‌పై డబ్బుల వర్షం, వీడియో వైరల్

ఇదేం పిచ్చిరా బాబు.. ఆ డబ్బును పేదలకు లేదా స్వచ్చంద సంస్థలకు ఇస్తే ఉపయోగపడుతుంది కదా అని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.

Gujarati Singer : ఇదేం పిచ్చి..సింగర్‌పై డబ్బుల వర్షం, వీడియో వైరల్

Singer

Drum Full Of Currency Notes : అభిమానాన్ని చాటుకునేందుకు కొత్త మార్గాలు ఎంచుకోవడం సహజమే. కానీ అదే కొన్ని సార్లు హద్దులు దాటి ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి వీడియో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది. గుజరాతీ ఫోక్ సింగర్ ఊర్వశీ రదాదియా పాటకు మెచ్చిన అభిమానులు.. ఆమెపై డబ్బుల వర్షం కురిపించారు.

Read More : Cleanest State : దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రం,నగరాలు ఇవే..విజయవాడకు అవార్డు

ఓ ఈవెంట్‌లో సాంగ్ పాడుతున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకోగా.. బకెట్లు బకెట్లుగా డబ్బులు చల్లారు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాండిల్‌లో షేర్ చేసిన ఊర్వశి.. అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది. ఇదేం పిచ్చిరా బాబు.. ఆ డబ్బును పేదలకు లేదా స్వచ్చంద సంస్థలకు ఇస్తే ఉపయోగపడుతుంది కదా అని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.

Read More : Sexual Abuse : కరస్పాండెంట్ వేధిస్తున్నాడని నర్సింగ్ విద్యార్ధినుల ధర్నా

ఇటీవల అహ్మదాబాద్‌లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు ఊర్వశీ. ఆ కార్యక్రమంలో వేదికపై కూర్చొని ఆమె హార్మోనియా వాయిస్తూ పాటలు పాడారు. దీంతో అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా ఊగిపోయారు. నోట్ల కట్టలను తీసి ఆమెపై చల్లారు. మరికొందరైతే బకెట్ల నిండా డబ్బును నింపి.. ఆమెపై గుమ్మరించారు. ఆ సమయంలో డబ్బంతా ఆమె మీద పడడంతో అదంతా పక్కకు తీసి ప్రదర్శన చేపట్టారు. ఈ వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఆమె అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Radadiya (@urvashiradadiya_official)