Siddipet: సిద్దిపేటలో సినీ ఫక్కీలో భారీ చోరీ.. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో గన్ ఫైర్!

సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.

Siddipet: సిద్దిపేటలో సినీ ఫక్కీలో భారీ చోరీ.. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో గన్ ఫైర్!

Gun Fire

Siddipet: సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ఓ దుండగుడు గన్ ఫైర్ చేయడంతో అక్కడివారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చేర్యాల‌కు చెందిన నర్సయ్య అనే రియల్టర్ డ్రైవర్  కాలుపై గన్‌తో కాల్చి పరారయ్యారు దుండగులు.

కారులో బ్యాగ్‌లో ఉన్న 48లక్షల 50 వేలను దుండగులు ఎత్తుకెళ్లారు. నంబర్ లేని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కారు అద్దాలు పగలగొట్టి డబ్బును ఎత్తుకెళ్లారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ఉండగా నర్సయ్య రిజిస్ట్రేషన్ ఆఫీసుకు రాగా.. కారులో డ్రైవర్ కూర్చొని ఉండగా అద్దాలు పగలగొట్టి డబ్బులు ఎత్తుకుని వెళ్లినట్లు రియల్టర్ నర్సయ్య చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.