OTT Films: ఈ వారం అరడజను సినిమాలు.. ఫుల్ మీల్స్ ఇస్తున్న ఓటీటీలు!

రాబోయే రెండు వారాలు ఓటీటీ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నాయి. థియేటర్ సందడి గట్టిగా లేకపోయినా.. ఓటీటీలో మాత్రం ఫుల్ సౌండ్ వినబడబోతుంది. స్మార్ట్ స్క్రీన్ ప్రేక్షకులను..

OTT Films: ఈ వారం అరడజను సినిమాలు.. ఫుల్ మీల్స్ ఇస్తున్న ఓటీటీలు!

Ott Films

OTT Films: రాబోయే రెండు వారాలు ఓటీటీ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నాయి. థియేటర్ సందడి గట్టిగా లేకపోయినా.. ఓటీటీలో మాత్రం ఫుల్ సౌండ్ వినబడబోతుంది. స్మార్ట్ స్క్రీన్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ మోస్ట్ అవైటైడ్ మూవీస్ కొన్ని హోమ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. అందులో కొన్ని డైరెక్ట్ డిజిటల్ ఎంట్రీ ఇస్తుంటే… మరికొన్ని థియేటర్స్ లొ సక్సెస్ కొట్టి హోమ్ ఎంట్రీలోనూ సత్తా చాటుతామంటున్నాయి.

Tollywood Star Hero’s: అభిమానులపై ప్రేమ కురిపిస్తోన్న హీరోలు!

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్.. అఖిల్ కు సాలిడ్ హిట్ ఇచ్చిన సినిమా. అలాగే కొవిడ్ తర్వాత ఆడియెన్స్ ను థియేటర్స్ లో కూర్చోబెట్టిన లవబుల్ మూవీ. అయ్యగారు హిట్ కొట్టారంటూ అభిమానులు పండగ చేసుకున్నారు ఈ బ్యాచిలర్ హిట్ తో. ఈ శుక్రవారం (నవంబర్ 19) నుంచి అచ్చ తెలుగు ఓటీటీ ఆహాతో పాటూ నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ మొదలైంది. అఖిల్ లుక్స్ ప్లస్ బుట్టబొమ్మ గ్లామర్ డోస్ కి బొమ్మరిల్లు భాస్కర్ ఇచ్చిన ట్రీట్ మెంట్.. స్మార్ట్ స్క్రీన్ ఆడియెన్స్ ను కూడా కట్టిపడేస్తుందనే ధీమాతో ఉన్నారు మేకర్స్.

Aha-Netflix: ఓటీటీలో వచ్చేసిన మరో రెండు సినిమాలు..!

ఇదే శుక్రవారం డైరెక్ట్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు తేజా సజ్జా. రాజశేఖర్ కూతురు శివానీ హీరోయిన్ గా నటించిన అద్భుతం మూవీ హాట్ స్టార్ లో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఒకే సిమ్ కార్డ్ ఇద్దరూ వాడితే ఎలా ఉంటుందన్న డిఫరెంట్ కాన్సెప్ట్ తో టైమ్ ట్రావెలింగ్ చేయించబోతున్నారు డైరెక్టర్ మల్లిక్ రామ్. ఇప్పటికే అద్భుతం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గ్యాప్ ఇవ్వకుండా ఓటీటీకి వచ్చేస్తుండటంతో అక్కడా హిట్ కొడతాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు తేజా సజ్జా.

RRR: ఆర్ఆర్ఆర్@4 ఏళ్ళు.. ఇన్ని రోజులు ఏం చేశారు?

బాలీవుడ్ ఆడియెన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సినిమా ధమాకా. కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్ చేసాడు ఈ మూవీలో. సొత్ కొరియన్ మూవీ ది టెర్రర్ లైవ్ ఆధారంగా ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు రామ్ మద్వానీ. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో జర్నలిస్టుల ఎదుర్కొనే సమస్యలను చూపించబోతున్నాడు కార్తీక్ ఆర్యన్. ఇప్పటికే హై స్వింగ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. నవంబర్ 19న నెట్ ఫ్లిక్స్ లో ఎలాంటి ఓపెనింగ్ సాధిస్తుందో చూడాలి.

Tollywood Directors: డైరెక్టర్‌లు రెడీ.. స్టార్ హీరోల సినిమాలు స్టార్టయ్యేదెప్పుడు?

డిమానిటేసేషన్ ను బేస్ చేసుకుని హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతున్న సినిమా క్యాష్. ఫన్నీ అండ్ సెటైరికల్ కాన్సెప్ట్ తో రిషభ్ సేత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అమోల్ పరేషర్, కెవిన్ డేవ్, స్మృతి కల్రా, గుల్షన్ గ్రోవ్ లీడ్ రోల్స్ చేసారిందులో. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా, డ్యాన్సింగ్ డైనమైట్ గా సౌత్ లోనూ, బాలీవుడ్ లోనూ మంచి క్రేజున్న స్టార్ ప్రభుదేవా. ఆయన ఫస్ట్ టైమ్ పోలీస్ గా యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్న సినిమా ‘పొన్ మాణిక్యవేల్’. ఏసీ ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వంలో నివేథా పెతురాజ్ హీరోయిన్ కాగా .. మహేంద్ర, సురేశ్ మీనన్ కీ రోల్స్ చేసారు. నిజానికి ముందు థియేటర్ రిలీజ్ అనుకున్నా ఫైనల్ గా ఓటీటీకే ఓటేసారు మేకర్స్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ శుక్రవారమే స్ట్రీమింగ్ మొదలైంది.

Sandeepa Dhar: సొగసుల సంపద సందీప సొంతం!

మిస్టీరియస్ సబ్జెక్ట్ తో మలయాళీ ఫిల్మ్ చురులీ ఈ వారమే సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కి రెడీఅయింది. చెంబన్ వినోద్ జోస్, వినయ్ ఫోర్ట్ లీడ్ రోల్స్ లో కనిపిస్తారు. అడ్వెంచరస్ ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ సినిమా సోనీ లివ్ లో రిలీజ్ చేశారు. వీటితో పాటు ది మైండ్ ఎక్స్ ప్రెస్ సీజన్ 2, యువర్ హానర్ సీజన్ 2, టైగర్ కింగ్ సీజన్ 2 కూడా ఈ వారమే ఓటీటీలలో సందడి చేస్తున్నాయి.