Hari Hara Veera Mallu: హీరోయిన్ ఫిక్స్.. జాక్వెలిన్ స్థానంలో కెన‌డియ‌న్ బ్యూటీ!

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్లమూడి రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో అభిమానులు..

Hari Hara Veera Mallu: హీరోయిన్ ఫిక్స్.. జాక్వెలిన్ స్థానంలో కెన‌డియ‌న్ బ్యూటీ!

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్లమూడి రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో అభిమానులు అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. గౌతమి పుత్ర శాతకర్ణి, మణికర్ణికా లాంటి హిస్టారికల్ సినిమాల తర్వాత క్రిష్ చేపట్టిన క్రేజీ ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. హరిహరవీరమల్లు ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కూడా పూర్తి కాగా మధ్య కోవిద్ క్లాష్ తో ఈ సినిమా వెనకబడి పవన్ భీమ్లా నాయక్ ముందుకొచ్చేసింది.

Bigg Boss 5 Telugu: ఫినాలేకి ముందే మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్.. నిజమా?

కాగా, పవన్ ప్రస్తుతం భీమ్లా నాయక్ బిజీతో ఉండగా.. అది పూర్తి కాగానే హరిహర వీరమల్లు మళ్ళీ పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం పవన్ సరసన నటించే హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. కాగా.. ఇందులో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంది. ఈ పాత్ర కోసం ముందుగా మేకర్స్ లంక బ్యూటీ జాక్వెలిన్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ జాక్వెలిన్ మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఇరుక్కకోవడంతో మేక‌ర్స్ ఆమె స్థానంలో మ‌రో న‌టిని ఎంపిక చేసే ప‌నిలో ఉన్న‌ట్టు ఆమధ్య వార్త‌లొచ్చాయి.

Sidhika Sharma: ఓరచూపులతో కైపెక్కిస్తున్న సిద్ధికా శర్మ!

జాక్వెలిన్ స్థానంలో మ‌రో కెన‌డియ‌న్ బ్యూటీ నోరా ఫ‌తేహిని ఎంపిక చేసే అవ‌కాశాలున్న‌ట్టు కూడా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రచారం నిజం చేసేలా నోరా ఫ‌తేహి ఈ సినిమాలో న‌టించేందుకు సైన్ చేసిన‌ట్టు బీటౌన్ స‌ర్కిల్ టాక్‌. త్వ‌ర‌లోనే సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ట ఈ డ్యాన్సింగ్ క్వీన్‌. బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ కూడా ఓ కీల‌క పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. పవన్ బందిపోటు దొంగగా నటిస్తున్న ఈ సినిమాను క్రిష్ ఏ స్థాయిలో తెరకెక్కిస్తాడో చూడాలి.