Pawan kalyan : ‘హరిహర వీరమల్లు’ యాక్షన్ సీన్స్ పై అప్‌డేట్

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో గ్రాండ్ విజువల్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు చాలా భారీ లెవెల్లో ఉన్నాయని సమాచారం. ఈ సినిమా స్టంట్ మాస్టర్ షామ్ కౌషల్.......

Pawan kalyan : ‘హరిహర వీరమల్లు’ యాక్షన్ సీన్స్ పై అప్‌డేట్

Harihara Veeramallu

Hari Hara Veeramallu :   ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి ‘భీమ్లా నాయక్’ సినిమా రాబోతుంది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది. ‘హరిహర వీరమల్లు’ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించనున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది.

 

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో గ్రాండ్ విజువల్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు చాలా భారీ లెవెల్లో ఉన్నాయని సమాచారం. ఈ సినిమా స్టంట్ మాస్టర్ షామ్ కౌషల్ లేటెస్ట్ గా దర్శకుడు క్రిష్ తో మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఒక ఫోటో షేర్ చేసి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ” హరి హర వీరమల్లు నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నాము. దానిపై బ్రిలియెంట్ డైరెక్టర్ క్రిష్ తో మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ సర్ కి, నిర్మాత AM రత్నం గారికి ధన్యవాదాలు. ఆ దేవుని ఆశీస్సులు మా సినిమాపై మరియు టీంపై ఉండాలని కోరుకుంటున్నాను” అని పోస్ట్ చేశారు.

Neha Sshetty : ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా అడిగిన జర్నలిస్ట్.. ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

 

దీంతో ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ భారీ లెవెల్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. పవన్ అభిమానులు ఈ ట్వీట్ తో పండగ చేసుకుంటున్నారు. పవన్ ని అలాంటి యాక్షన్ సీన్స్ లో చూడాలని సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.