Rain today updates : పలు రాష్ట్రాల్లో నేడు భారీవర్షాలు..ఐఎండీ హెచ్చరికలు జారీ

దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది....

Rain today updates : పలు రాష్ట్రాల్లో నేడు భారీవర్షాలు..ఐఎండీ హెచ్చరికలు జారీ

weather update

Rain today updates : దేశంలోని పలు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీవర్షాలు, వరదల వల్ల ప్రజలు మంచినీటి ఎద్దడి, ట్రాఫిక్ అంతరాయాలు, విద్యుత్ సరఫరా అంతరాయాలతో సతమతమవుతున్నారు. (Rain today LIVE updates) రాబోయే నాలుగైదు రోజుల్లో తూర్పు, ఈశాన్య, తూర్పు మధ్య భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

Manipur viral video case : సుప్రీంకోర్టును ఆశ్రయించిన మణిపూర్ మహిళా బాధితులు

తెలంగాణ, ఒడిశా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య భారత రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు. (weather update)గత వారం విస్తారమైన వర్షాల వల్ల ప్రభావితమైన ముంబయిలో మంగళవారం వరకు గ్రీన్ అలర్ట్ జారీ చేశారు.

California airport : కాలిఫోర్నియాలో హ్యాంగర్‌ను ఢీకొన్న చిన్న విమానం…ముగ్గురి మృతి

ఆగస్టు 2,3 తేదీల్లో ఢిల్లీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న తెలంగాణలో కూడా సోమవారం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. (Moderate showers in Telangana) రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్‌లోని తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. (heavy rainfall likely in Odisha)

Covid In US : అమెరికాలో మళ్లీ కొవిడ్ ముప్పు…సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెచ్చరిక

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) సంతృప్తికరంగా ఉంది. వాయుకాలుష్యంతో సతమతమయ్యే ఢిల్లీలో భారీవర్షాల వల్ల మంచి గాలి వీస్తోంది. ఒడిశాలోని పూరి, ధేనకనల్, ఇతర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. బాలాసోర్, కటక్, జాజ్‌పూర్, సుందర్‌ఘర్, ఇతర ప్రాంతాల్లో ఐఎండీ (#weather) ఎల్లో అలర్ట్ జారీ చేసింది.