Karthi : ‘మ్యాన్ అఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న హీరో కార్తీ..

తమిళ హీరో కార్తీ.. తన అన్న సూర్య లానే తెలుగులోను మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక గత ఏడాది ఈ హీరో హిట్టు మీద హిట్టు అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. తాజాగా ఈ హీరో 2022కు గాను 'మ్యాన్ అఫ్ ది ఇయర్' అవార్డు అందుకున్నాడు.

Karthi : ‘మ్యాన్ అఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న హీరో కార్తీ..

Hero Karthi received the Man of the Year award

Karthi : తమిళ హీరో కార్తీ.. తన అన్న సూర్య లానే తెలుగులోను మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక గత ఏడాది ఈ హీరో హిట్టు మీద హిట్టు అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ కార్తీ.. విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్టుని అందుకున్నాడు. ఈ మూడు సినిమాల్లో ‘విరుమాన్’ తెలుగులో విడుదల కాలేదు. తాజాగా ఈ హీరో 2022కు గాను ‘మ్యాన్ అఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు.

Karthi Japan : కార్తీ ‘జపాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. జపాన్ మేడ్ ఇన్ ఇండియా!

సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, ‘ఉళవన్ ఫౌండేషన్’ అనే సేవ సంస్థ ద్వారా అనేక సామజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాడు కార్తీ. అంతేకాదు రాష్ట్రంలోని రైతన్నలను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇక ఈ సేవ కార్యక్రమాలని గుర్తించిన ప్రముఖ తమిళ టీవీ ఛానల్.. కార్తీని ‘మ్యాన్ అఫ్ ది ఇయర్ అఫ్ 2022’ అవార్డుతో సత్కరించింది. అయితే ప్రస్తుతం హీరో కార్తీ హాలిడే వెకేషన్ లో ఉన్నాడు. స్పెయిన్ లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుండడంతో ఈ అవార్డు వేడుకకు రాలేకపోయాడు.

దీంతో ఈ అవార్డుని కార్తీ స్నేహితుడు, సర్దార్ నిర్మాత అయిన లక్ష్మణన్ అందుకున్నాడు. ఈ సందర్భంగా లక్ష్మణన్ మాట్లాడుతూ.. ‘కార్తీ తరుపు నుంచి ఈ అవార్డుని అందుకోవడం నాకు ఎంతో గౌరవంగా ఉంది’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, కార్తీ నిర్వహించే పలు సేవ కార్యక్రమాలు గురించి, కార్తీ నటన గురించి కొనియాడాడు. కాగా ప్రస్తుతం కార్తీ పొన్నియిన్ సెల్వన్-2, జపాన్ సినిమాలో నటిస్తున్నాడు. పొన్నియిన్ సెల్వన్-2 ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. వీటి తరువాత ఖైదీ-2, సర్దార్-2 చిత్రాలను లైన్ పెట్టనున్నాడు.