Karthikeya 2 : నా సినిమాని రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటున్నారు.. నిఖిల్ ఆవేదన..

నిఖిల్ మాట్లాడుతూ.. ''బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చే హీరోల సినిమాలు, చిన్న సినిమాలని పక్కకి పడేస్తారు అని అంటారు కదా, అలాగే మా సినిమాకి కూడా జరిగింది. ఇప్పటికే చాలా సార్లు రిలీజ్ డేట్ ని మార్చాం.

Karthikeya 2 : నా సినిమాని రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటున్నారు.. నిఖిల్ ఆవేదన..

Nikhil

Nikhil :  నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 రాబోతుంది. ఈ సారి సినిమాని మరింత కొత్త కథతో, మరింత సస్పెన్స్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిఖిల్ తన సినిమాని రిలీజ్ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటర్వ్యూలో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇన్నాళ్లు ఎందుకు వాయిదా వేస్తూ వచ్చారు అని అడిగారు.

Naga Chaitanya : సమంత దారి సమంతది.. నా దారి నాది..

దీనికి నిఖిల్ మాట్లాడుతూ.. ”బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చే హీరోల సినిమాలు, చిన్న సినిమాలని పక్కకి పడేస్తారు అని అంటారు కదా, అలాగే మా సినిమాకి కూడా జరిగింది. ఇప్పటికే చాలా సార్లు రిలీజ్ డేట్ ని మార్చాం. ఆగస్ట్‌ 12 రిలీజ్ డేట్ చెప్పినప్పుడు కొంతమంది అది కూడా వద్దని చెప్పారు. అక్టోబర్‌ లేదా నవంబర్ కి వెళ్లిపోండి అన్నారు. మీకు షోస్‌ దొరకవు, థియేటర్లు ఇవ్వము అని కూడా కొంతమంది అన్నారు. అప్పుడు చాలా ఏడ్చాను. హ్యాపీ డేస్‌ సినిమా నుంచి ఇలాంటి సంఘటనలు చూసినా ఇప్పటివరకు మూవీ విడుదల కాదు, థియేటర్లు దొరకవు అని ఎప్పుడూ అనిపించలేదు. కానీ ఈ సారి చాలా మంది సినిమాని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. దీంతో బాగా ఏడుపొచ్చేసింది. నువ్వు ఎంత కష్టపడినా నీ సినిమా రిలీజ్‌ అవ్వదురా అని ఒకరు అన్నారు. అప్పుడు చాలా బాధగా అనిపించింది. కానీ పట్టు వదలకుండా చివరికి మా నిర్మాతలు విశ్వ ప్రసాద్‌, అభిషేక్ సపోర్ట్‌తో ఆగస్టు 12నే రిలీజ్ చేస్తున్నాం” అని తెలిపాడు. దీంతో నిఖిల్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి. నిఖిల్ సినిమాని అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు.