Sumanth : ఇప్పుడు విడాకులు అనేవి కామన్.. విడాకులపై హీరో సుమంత్ వ్యాఖ్యలు..

విడాకుల విషయంపై సుమంత్‌ మాట్లాడుతూ.. ''నాకు తెలిసిన చాలా మంది విడాకులు తీసుకున్నారు. మా కుటుంబంలో కూడా విడాకులున్నాయి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు విడాకులు అనేవి చాలా.........

Sumanth : ఇప్పుడు విడాకులు అనేవి కామన్.. విడాకులపై హీరో సుమంత్ వ్యాఖ్యలు..

Sumanth

Sumanth :  హీరో సుమంత్‌ తాజాగా నటించిన చిత్రం ‘మళ్లీ ముదలైంది’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఫిబ్రవరి 11న రిలీజ్‌ అవ్వనుంది. నిన్న సుమంత్ బర్త్ డే కూడా కావడంతో ఈ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ‘మళ్ళీ మొదలైంది’ సినిమా విడాకుల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్వూలో సుమంత్‌ విడాకులపై మాట్లాడాడు.

విడాకుల విషయంపై సుమంత్‌ మాట్లాడుతూ.. ”నాకు తెలిసిన చాలా మంది విడాకులు తీసుకున్నారు. మా కుటుంబంలో కూడా విడాకులున్నాయి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఈ విషయంలో దురదృష్టం అని కూడా అనలేము. అలా జరుగుతున్నాయంతే. కానీ రెండో పెళ్లి విషయానికొచ్చేసరికి కొన్ని కష్టాలున్నప్పటికీ సర్ధుకుపోతున్నారు. రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయితే ఒక నెగిటివ్ ముద్ర పడిపోతుందని చాలా మంది రెండో పెళ్లిని ఎలాగోలా కొనసాగించాలని అంతా అనుకుంటున్నారు.” అని తెలిపారు.

Raviteja : ‘ఖిలాడీ’ సినిమా వాయిదా పడనుందా??

సుమంత్ కూడా గతంలో కీర్తిరెడ్డితో విడాకులు తీసుకున్నారు. ఇటీవలే అక్కినేని కుటుంబంలో నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో సుమంత్ విడాకుల మీద మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు మరింత ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి.