Prakruti Mishra : హీరోయిన్ పై దాడి చేసిన హీరో భార్య.. నన్ను వేధిస్తుంది అంటూ వాపోయిన హీరోయిన్

హీరో, హీరోయిన్స్ ఇద్దరూ భువనేశ్వర్‌ లో కారులో బయలుదేరగా కారుని రోడ్డుమీదే ఆపేసి కారులోకి ఎక్కి హీరోయిన్ ప్రకృతి జుట్టుపట్టుకుని లాగింది. దయచేసి సాయం చేయండి అని హీరోయిన్‌ అడుగుతున్నా............

Prakruti Mishra : హీరోయిన్ పై దాడి చేసిన హీరో భార్య.. నన్ను వేధిస్తుంది అంటూ వాపోయిన హీరోయిన్

Prakruthi Sharma

Prakruti Mishra :  ఒడియా హీరోయిన్‌ ప్రకృతి మిశ్రా, హీరో బాబుషాన్‌ మెహంతి గతంలో ఓ సినిమాలో కలిసి నటించారు. గత కొద్దీ రోజుల నుంచి వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని మెహంతి భార్య తృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ విషయంలో మెహంతితో గొడవలు కూడా పెట్టుకుంది. వీళ్లిద్దరి సంగతి చూడాలని, ఇద్దర్ని ఒకేసారి పట్టుకోవాలని ఫిక్స్ అయిన తృప్తి ఈ హీరో, హీరోయిన్స్ ఇద్దరూ భువనేశ్వర్‌ లో కారులో బయలుదేరగా కారుని రోడ్డుమీదే ఆపేసి కారులోకి ఎక్కి హీరోయిన్ ప్రకృతి జుట్టుపట్టుకుని లాగింది. దయచేసి సాయం చేయండి అని హీరోయిన్‌ అడుగుతున్నా అక్కడున్నవాళ్లు మాత్రం వీడియోలు తీస్తూ ఉన్నారు. హీరో కూడా ఏమి చేయలేకపోయాడు. ఎలాగోలా హీరోయిన్ ఆమె నుంచి విడిపించుకుని కారు దిగి వెళ్లిపోతున్నా హీరో భార్య మాత్రం ఆమెను వెంబడిస్తూ కొడుతూ, నెట్టేస్తూ దాడి చేసింది. హీరోయిన్ ఆటో పట్టుకొని వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

దీంతో ఆ హీరో, హీరోయిన్స్ పై రకరకాల వార్తలు వచ్చాయి. దీనిపై హీరోయిన్ ప్రకృతి మాట్లాడుతూ తన సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో ప్రకృతి మాట్లాడుతూ.. ”కనీసం మేము చెప్పేది కూడా వినకుండా అమ్మాయిలదే తప్పు అని చాలామంది అంటున్నారు. మనం అలాంటి సమాజంలో బతుకుతున్నాం. నా సహ నటుడు బాబుషాన్‌తో ఓ కార్యక్రమానికి వెళ్లి వచ్చాను. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న అతడి భార్య, కొంతమందితో కలిసి నాపై దాడి చేసింది. నన్ను మానసికంగానూ హింసించింది. ఇది అస్సలు కరెక్ట్‌ కాదు. నేను మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నాను. కానీ నిజ జీవితంలో ఇలా నేను వేధింపులకు గురవుతున్నాను” అని తెలిపింది. ఈ గొడవ గురించి చెప్పింది.

Laal Singh Chaddha : ఒకరికొకరు పానీపూరి తినిపించుకున్న అమీర్ ఖాన్, చిరంజీవి..

అయితే నెటిజన్లు మాత్రం హీరోయిన్ ని ట్రోల్ చేస్తున్నారు. మహిళా సాధికారత అనే మాటలు అడ్డం పెట్టుకొని ఇష్టమొచ్చినట్టు చేస్తున్నావు, ఆమె భర్తతో నీకు పనేంటి, నువ్వు తప్పు చేయలేదన్న గ్యారెంటీ ఏంటి, రెడ్ హ్యాండెడ్ గా దొరికావు.. ఇలా నెటిజన్లు తను పెట్టిన వీడియోకి కామెంట్స్ పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by OTV NEWS (@otv.news)