Spy Movies: స్పైలుగా మారిపోతున్న హీరోలు.. హాలీవుడ్ జానర్ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకో?

సినిమా ఇండస్ట్రీలో హాలీవుడ్ మూవీ ఫార్ములా మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. రొమాన్స్, కామెడీ, థ్రిల్లర్, హారర్ జానర్స్ అన్నీ అయిపోయాయి. అందుకే హీరోలందరూ స్పై లు అయిపోతున్నారు.

Spy Movies: సినిమా ఇండస్ట్రీలో హాలీవుడ్ మూవీ ఫార్ములా మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. రొమాన్స్, కామెడీ, థ్రిల్లర్, హారర్ జానర్స్ అన్నీ అయిపోయాయి. అందుకే హీరోలందరూ స్పై లు అయిపోతున్నారు. సౌత్ టూ నార్త్ అందరూ స్పై మూవీస్ మీద ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మరి అంతగా సక్సెస్ ట్రాక్ రికార్డ్ లేని స్పై జానర్ ని సెలక్ట్ చేసుకున్న మన హీరోలకు ఈ సినిమాలు వర్కవుట్ అవుతాయా..? సడెన్ గా రూట్ మారుస్తున్నారు హీరోలు. అన్ని జానర్స్ ట్రై చేసిన వాళ్లు ఇప్పుడు స్పై లుగా మారిపోతున్నారు. అసలే ఈ జానర్ పెద్దగా హిట్ అయినట్టు హిస్టరీలో లేదు. కానీ ఈ మధ్య ఈ హాలీవుడ్ జానర్ మీద మనసు పడుతున్నారు మన హీరోలు.

Beast: దక్షణాది అన్ని భాషల్లో ‘బీస్ట్’.. హిందీలో మాత్రం ‘రా’.. ఎందుకిలా?

లేటెస్ట్ గా తమిళ్ స్టార్ హీరో విజయ్ బీస్ట్ మూవీని స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ గానే తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ బీస్ల్ మూవీలో స్టైలిష్ స్పై గా కనిపిస్తున్నారు విజయ్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ హై యాక్షన్ ఎంటర్ టైనర్ లో విజయ్ తనయాక్షన్ స్కిల్స్ అన్నీ చూపిస్తున్నారు. శాంపిల్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లోనే స్పై గా ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేశారు విజయ్. ఇంతవరకూ ఈ జానర్ పెద్దగా ట్రై చెయ్యని విజయ్ ని చూసి ఫాన్స్ ఫుల్ ఫిదా అయిపోయిన ఫాన్స్ సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటున్నారు. అందుకే రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

Agent: అఖిల్ ఆశలన్నీ ఏజెంట్‌పైనే.. స్టార్ హీరో స్టేటస్ తెచ్చేనా?

అక్కినేని హీరో అఖిల్ కూడా స్పై మూవీతోనే ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇప్పటి వరకూ లవర్ బాయ్, క్యూట్ బాయ్ క్యారెక్టర్లు చేసిన అఖిల్.. ఇలాంటివైతే పెద్దగా వర్కవుట్ కావని, మాస్ ఇమేజ్ కోసం మాంచి స్పై మూవీ ప్లాన్ చేశారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఏజెంట్ మూవీని తెరకెక్కిస్తున్నారు అఖిల్. నిజానికి సౌత్ లో చేసిన స్పై మూవీస్ పెద్దగా ఆకట్టుకోలేదు. కమల్ హాసన్ చేసిన విశ్వరూపం అస్సలు ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యలేపోయింది. అంతేకాదు.. తెలుగులో స్టార్ హీరోలు చేసిన స్పై యాక్షన్ ఎంటర్ టైనర్స్ ఈమధ్య కాలంలో పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

Raja Sekhar : యాంగ్రీ స్టార్ డిమాండ్ మామూలుగా లేదుగా..

మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్లో చేసిన స్పై యాక్షన్ త్రిల్లర్ స్పైడర్ మూవీ అస్సలు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యలేకపోయింది. కానీ మోస్ట్ స్టైలిష్ లుక్ లో మహేష్ మాత్రం ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేశాడు. స్టార్ హీరోలు చేసిన స్పై మూవీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా స్టార్ డమ్ లేని హీరోలు చేసిన స్పై మూవీస్ మాత్రం బాగా సక్సెస్ అయ్యాయి. సీనియర్ హీరో రాజశేఖర్ చేసిన పిఎస్ వి గరుడ వేగ స్పై థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక అప్ కమింగ్ హీరో.. అడవిశేష్ చేసిన గూడఛారి మూవీ సక్సెస్ అప్పట్లో టాలీవుడ్ కి హాట్ టాపిక్ అయ్యింది.

Kamal Haasan : లోకనాయకుడు వచ్చేస్తున్నాడు.. ‘విక్రమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

సౌత్ సంగతి అటుంచితే బాలీవుడ్ హీరోలైతే వరస పెట్టి స్పై మూవీస్ చేస్తున్నారు. అటు సల్మాన్ ఖాన్ నంచి స్టార్ట్ చేస్తే.. షారూఖ్, హృతిక్ ఇలా స్టార్ హీరోలందరూ స్పై యాక్షన్స్ తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. బాలీవుడ్ లో మాత్రం స్పై యాక్షన్ మూవీస్ కి మంచి క్రేజ్ తో పాటు హిట్ రికార్డ్ కూడా ఉంది. అందుకే బాలీవుడ్ హీరోలు వరస పెట్టి స్పై మూవీస్ తో ఎంగేజ్ అయిపోయారు. సల్మాన్ ఖాన్ తన స్పై మూవీ టైగర్ సిరీస్ లో థర్డ్ పార్ట్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సల్మాన్ కెరీర్ లోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ స్పై సిరీస్ కి సంబంధించి టైగర్ 3 నెక్ట్స్ ఇయర్ రిలీజ్ అవుతోంది.

Agent: క్రేజీ అప్డేట్.. అఖిల్ ఏజెంట్ లో మలయాళ మెగాస్టార్!

5 ఏళ్ల నుంచి మంచి సినిమాతో కమ్ బ్యాక్ అవుదామని వెయిట్ చేస్తున్న షారూఖ్ ఖాన్ కి కూడా స్పై థ్రిల్లరే కలిసొచ్చేలా ఉంది. పఠాన్ టైటిల్ తో దీపికా పదుకోన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. టీజర్ తోనే ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు షారూఖ్. నెవర్ బిఫోర్ యాక్షన్ ఎలివేషన్ తో షారూఖ్ ఈ స్పై మూవీ తెరకెక్కిస్తున్నారు. స్పై మూవీ వార్ తోనే అదిరిపోయే హిట్ అందుకున్న హృతిక్ రోషన్ తన అప్ కమింగ్ మూవీని కూడా స్పై మూవీగానే తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా హృతిక్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు ఫాన్స్. మరి బాలీవుడ్ కి ఇంతగా సక్సెస్ ఇచ్చిన స్పై మూవీస్ సౌత్ కి ఈసారైనా మెమరబుల్ సక్సెస్ ఇస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫాన్స్.

ట్రెండింగ్ వార్తలు