Anjali : అలాంటి సీన్స్ చేయాల్సొచ్చినప్పుడు కారవాన్‌లోకి వెళ్లి ఏడ్చాను.. కానీ తప్పదుగా..

హీరోయిన్ గానే కాక స్పెషల్ క్యారెక్టర్స్, గెస్ట్ అప్పీరెన్స్, ఐటెం సాంగ్స్ కి కూడా షిఫ్ట్ అయింది అంజలి. ఇటీవల కొన్ని వెబ్ సిరీస్ లలో బోల్డ్ సీన్స్ లో కూడా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తెలుగమ్మాయేనా ఈ రేంజ్ లో బోల్డ్ సీన్స్ చేస్తుందని అంతా అనుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి బోల్డ్ సీన్స్............

Anjali : అలాంటి సీన్స్ చేయాల్సొచ్చినప్పుడు కారవాన్‌లోకి వెళ్లి ఏడ్చాను.. కానీ తప్పదుగా..

Heroine Anjali comments on Bold Scenes

Anjali : తెలుగమ్మాయి అంజలి పేరుకే తెలుగమ్మాయి అయినా తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులో ఎంట్రీ ఇచ్చినా ఇక్కడ అంతగా అవకాశాలు లేకపోవడంతో తమిళ్ లో తను చేసిన మొదటి సినిమా హిట్ అవ్వడంతో అక్కడే వరుస సినిమాలు చేసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగులో కూడా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి.

ఇక హీరోయిన్ గానే కాక స్పెషల్ క్యారెక్టర్స్, గెస్ట్ అప్పీరెన్స్, ఐటెం సాంగ్స్ కి కూడా షిఫ్ట్ అయింది అంజలి. ఇటీవల కొన్ని వెబ్ సిరీస్ లలో బోల్డ్ సీన్స్ లో కూడా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తెలుగమ్మాయేనా ఈ రేంజ్ లో బోల్డ్ సీన్స్ చేస్తుందని అంతా అనుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి బోల్డ్ సీన్స్ గురించి మాట్లాడింది అంజలి.

Tamannaah : రొమాంటిక్ సన్నివేశాల్లో హీరోలు అలా ఉంటారు.. చాలా కష్టం..

అంజలి మాట్లాడుతూ.. సినిమాలలో బోల్డ్ సీన్స్, ముద్దు సన్నివేశాలు చేయడం చాలా కష్టం. అందులోను ఇష్టం లేని వ్యక్తితో ముద్దు సీన్స్ వస్తే అది ఇంకా కష్టం. నేను అలాంటి సన్నివేశాన్ని ఎదుర్కొన్నాను. అలాంటి ముద్దు సీన్లు, బోల్డ్ సీన్స్ వస్తే కారవాన్ లోకి వెళ్లి ఏడ్చేసేదాన్ని. కానీ తప్పదుగా అని చెప్పి ఆ సీన్స్ చేసేదాన్ని అని తెలిపింది.