Fariya Abdullah : రోడ్డు మీద తీన్మార్ డ్యాన్స్ వేసిన హీరోయిన్

తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడ షాప్ ఓపెనింగ్ కి డప్పులు కొట్టడానికి వచ్చిన వాళ్ళతో కలిసి వాళ్ళు డ్రమ్స్ వాయిస్తుంటే తీన్మార్ స్టెప్పులతో డ్యాన్స్ చేసి

Fariya Abdullah : రోడ్డు మీద తీన్మార్ డ్యాన్స్ వేసిన హీరోయిన్

Fariya

Fariya Abdullah :  అప్పుడప్పుడు హీరోలు, హీరోయిన్స్ ఏదైనా ఫంక్షన్ లేదా ప్రోగ్రాంలో యాంకర్ కానీ, అభిమానులు కానీ అడిగితే స్టేజీపై స్టెప్పులు వేస్తారు. బయట రోడ్ మీద ఉన్నప్పుడు తామొక సెలబ్రిటీ అని గుర్తుంచుకుంటారు. చాలా తక్కువ మంది సెలెబ్రిటీలు రోడ్ మీద మామూలు జనాలతో కలిసిపోతూ ఉంటారు. ఇలా కలిసే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ ఇలా రోడ్ మీద జనాలతోకలిసి తీన్మార్ డ్యాన్స్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మనందరినీ ఎంతగానో నవ్వించిన ‘జాతిర‌త్నాలు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ఫ‌రియా అబ్ధుల్లా. తొలి సినిమాతోనే పెద్ద హిట్ సాధించింది. మొదటి సినిమాతోటే భారీగా అభిమానులని సంపాదించుకుంది. ఫరియా హీరోయిన్ అవ్వకముందు మంచి డ్యాన్సర్, రంగస్థల నటి. తన సోషల్ మీడియాలో కూడా ఫోటోల కంటే ఎక్కువగా తన డ్యాన్స్ వీడియోలే ఉంటాయి. అన్ని రకాల డ్యాన్సులని చేస్తుంది ఫరియా. మ్యూజిక్ వింటే తన కాళ్ళు ఆగవని చెప్తుంది ఈ భామ.

Sneha Ullal : తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న పిల్లి కళ్ళ పాప..

తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడ షాప్ ఓపెనింగ్ కి డప్పులు కొట్టడానికి వచ్చిన వాళ్ళతో కలిసి వాళ్ళు డ్రమ్స్ వాయిస్తుంటే తీన్మార్ స్టెప్పులతో డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రోడ్ మీదే ఇలా హీరోయిన్ డ్యాన్స్ చేసేసరికి అందరు షాక్ అయ్యారు. ఈ డ్యాన్స్ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… న‌న్ను నేను కంట్రోల్ చేసుకోలేక‌పోయా. డ్ర‌మ్ ప‌వ‌ర్ అంటే ఇదే అని త‌న వీడియోకి కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Faria Abdullah (@fariaabdullah)