Radha : మళ్ళీ తెరపై కనపడనున్న అలనాటి అందాల తార రాధ

రాధ త్వరలో బుల్లితెరపై సందడి చేయబోతున్నానంటూ ఓ షో ప్రోమోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై ట్వీట్‌ చేస్తూ.. ‘చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ వస్తున్నాను. ఓ రియాలిటీ షోకు..............

Radha :  మళ్ళీ తెరపై కనపడనున్న అలనాటి అందాల తార రాధ

Radha

Radha :   80, 90 దశకంలో ఆనాటి అగ్ర హీరోలు సూపర్‌ స్టార్‌ కృష్ణ, మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ.. ఇలా అందరితో నటించి తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా నిలిచారు అలనాటి అందాల తార రాధ. చిరంజీవి-రాధ కలిసి చాలా సినిమాలు తీశారు. వెండితెరపై అప్పట్లో బెస్ట్ జోడిగా వీళ్ళిద్దరూ పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాలు మానేసి పెళ్లి చేసుకొని బిజినెస్ లో మునిగిపోయారు రాధ. ఆ తర్వాత తన కూతురు కార్తీక హీరోయిన్ గా మారినప్పుడు మీడియా ముందుకి వచ్చారు. తాజాగా మరోసారి కెమెరా ముందుకి రాబోతున్నారు రాధ.

Star Heroin’s Remuneration: హిట్ పడిందా.. చుక్కలు చూపిస్తున్న హీరోయిన్లు!

రాధ త్వరలో బుల్లితెరపై సందడి చేయబోతున్నానంటూ ఓ షో ప్రోమోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై ట్వీట్‌ చేస్తూ.. ‘చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ వస్తున్నాను. ఓ రియాలిటీ షోకు న్యాయనిర్థేతగా వ్యవహరించేందుకు బుల్లితెరపైకి వస్తున్నాను. నా కో-జడ్జీగా నకుల్‌ వ్యవహరిస్తున్న ఈ సూపర్‌ క్వీన్స్‌ షో జీ తమిళ్‌లో ప్రసారం కాబోతోంది. ఈ షోకు జడ్జీగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ షోలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను. ఎంతోమంది అమ్మాయిల ప్రతిభను ఈ కార్యక్రమం ద్వారా చూడటం చాలా గర్వంగా ఉంది’ అంటూ పోస్ట్ చేశారు. ఈ సూపర్ క్వీన్స్ షో జనవరి 16 నుంచి జీ తమిళ్ లో టెలికాస్ట్ కానుంది.