Sreeleela : ఓ వైపు సినిమాలు.. ఓ వైపు చదువు.. హీరోయిన్ శ్రీలీల ఏం చదువుతుందో తెలుసా..??

తాజాగా ధమాకా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల తన చదువు గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. శ్రీలీల మాట్లాడుతూ..........

Sreeleela : ఓ వైపు సినిమాలు.. ఓ వైపు చదువు.. హీరోయిన్ శ్రీలీల ఏం చదువుతుందో తెలుసా..??

heroine sreeleela tells about her study

Sreeleela :  కన్నడ భామ శ్రీలీల పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. రాఘవేంద్రరావు శ్రీలీలని టాలీవుడ్ కి పరిచయం చేసాడు. ఆ సినిమాతో మంచి విజయం అందుకొని ఒక్కసారిగా పాపులర్ అయి వరుసగా ఆఫర్లు అందుకుంటుంది శ్రీలీల. ఇప్పటికే శ్రీలీల చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. రవితేజ సరసన శ్రీలీల నటించిన ధమాకా సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ తో పాటు ప్రమోషన్స్ లో బిజీగా ఉంది శ్రీలీల.

Nayanathara : పెళ్లయ్యాక అమ్మాయి జీవితం ఏం మారదు..

తాజాగా ధమాకా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీల తన చదువు గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. శ్రీలీల మాట్లాడుతూ.. నేను ప్రస్తుతం MBBS చదువుతున్నాను. MBBS చదువుతూనే సినిమాలు చేస్తున్నాను. కెరీర్, స్టడీ రెండూ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. ఇందుకు మా అమ్మ సపోర్ట్ చాలా ఉంది. మా అమ్మ కూడా డాక్టర్. మా అమ్మ MBBS తర్వాత పెళ్లి చేసుకున్న పదేళ్ల తర్వాత PG పూర్తిచేసింది. ఇప్పుడు డాక్టర్ గా చేస్తుంది. ప్రస్తుతానికి MBBS చేస్తున్నాను, దాని తర్వాత ఏం చేయాలి అని ఇంకా డిసైడ్ చేసుకోలేదు. సినిమాలైతే చేతిలో చాలానే ఉన్నాయి అని తెలిపింది.