NTR30: ఎన్టీఆర్ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం పలువురు హీలీవుడ్ టెక్నీషియన్లు కూడా జాయిన్ అవుతున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ సినిమాలో జాయన్ అయినట్లుగా చిత్ర యూనిట్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

NTR30: ఎన్టీఆర్ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్

Hollywood Action Choreographer On Board For NTR30

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న తాజా చిత్రం NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా లాంచ్ చేసింది చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు తారక్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్‌బస్టర్ కొట్టి తన లాస్ట్ మూవీ రిజల్ట్‌ను అధిగమించాలని కొరటాల ప్రయత్నిస్తున్నాడు.

NTR30: ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యిందా.. అందుకేనా?

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్‌తో పాటు పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా జాయిన్ అవుతున్నారు. తాజాగా ఈ సినిమాలో హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్ కెన్ని బేట్స్ జాయిన్ అయినట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వర్కింగ్ స్టిల్‌తో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్.

NTR 30 : భారీగా NTR30 ఓపెనింగ్.. రాజమౌళి, ప్రశాంత్ నీల్.. అనేక మంది సినీ ప్రముఖుల సమక్షంలో..

ఈ సినిమాలో తారక్ పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని.. ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా రానుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.