NTR : ఎన్టీఆర్ పై హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ట్వీట్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

ఇటీవల జరిగిన HCA అవార్డ్స్ కి రామ్ చరణ్ హాజరయ్యి, ఎన్టీఆర్ వెళ్ళాక పోవడంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా బాధ పడ్డారు. తాజాగా దీని పై హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ట్వీట్ చేసింది.

NTR : ఎన్టీఆర్ పై హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ట్వీట్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

Hollywood Critics Association tweet on NTR

NTR : రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. కాగా ఈ చిత్రం ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ లో ఏకంగా 5 అవార్డులు అందుకొని సంచలనం సృష్టించింది. అయితే ఈ అవార్డుల పురస్కారంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా బాధ పడ్డారు. ఈ అవార్డు ఫంక్షన్ కి రాజమౌళి, కీరవాణి, సెంథిల్ కుమార్, రామ్ చరణ్ హాజరు కాగా, ఎన్టీఆర్ వేళ్ళ లేదు.

NTR30: ఎన్టీఆర్ 30 లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్..?

ఇక ఈ అవార్డ్స్ లో RRR చిత్రానికి స్పాట్ లైట్ అవార్డు వచ్చింది. ఆ అవార్డుని రామ్ చరణ్ అందుకున్నాడు. ఈ అవార్డు అందుకోవడంతో చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా HCA ని.. ఎన్టీఆర్ ని ఎందుకు అవార్డ్స్ కి పిలవలేదు. స్పాట్ లైట్ అవార్డు అనేది రామ్ చరణ్ కి ఎందుకు ఇచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం పై HCA టీం స్పందిస్తూ.. డియర్ RRR ఫాన్స్, మేము ఎన్టీఆర్ ని HCA ఫిలిం అవార్డ్స్ కి పిలిచాము. కానీ ఆయన బ్రదర్ మరణం మరియు కొత్త మూవీ షూటింగ్ వల్ల రాలేకపోయాడు. బాధపడకండి ఆయనకి కూడా అవార్డు ఉంది. త్వరలోనే అది ఎన్టీఆర్ అందుకుంటాడు అని ట్వీట్ చేశారు.

ఇక ట్వీట్స్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ట్వీట్స్ ని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా తారకరత్న అకాల మరణం వలన పోస్ట్‌పోన్ అయిన NTR30 మూవీ లాంచ్.. మర్చి 18న జరగనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మర్చి మొదటి వారంలో హీరోయిన్ అనౌన్స్ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.