Russo Brothers : ధనుష్ కోసం భారత్‌కి రాబోతున్న అవెంజర్స్, కెప్టెన్ అమెరికా డైరెక్టర్స్..

ది గ్రే మ్యాన్ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా భారత్ లో నిర్వహించాలనుకుంటున్నారు నెట్ ఫ్లిక్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కి గా...........

Russo Brothers : ధనుష్ కోసం భారత్‌కి రాబోతున్న అవెంజర్స్, కెప్టెన్ అమెరికా డైరెక్టర్స్..

Dhanush

Dhanush :  హీరో ధనుష్ తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూనే తెలుగు, హిందీలో కూడా సినిమాలు చేస్తున్నాడు. అంతే కాకుండా ఇటీవల హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సినిమాలు చేస్తున్నాడు. హాలీవుడ్‌ మూవీ ‘ది గ్రే మ్యాన్’ సినిమాలో ధనుష్ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాని కెప్టెన్‌ అమెరికా: సివిల్‌ వార్, కెప్టెన్‌ అమెరికా: వింటర్‌ సోల్జర్‌, అవేంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌, అవేంజర్స్‌: ఎండ్‌ గేమ్‌.. లాంటి సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలని తెరకెక్కించిన దర్శకులు రూసో బ్రదర్స్‌ డైరెక్ట్ చేశారు. మార్క్‌ గ్రీన్‌ రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ది గ్రే మ్యాన్ సినిమా జులై 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Hyper Aadi : హరిహర వీరమల్లు కోసం వర్క్ చేస్తున్నాను.. పవన్‌కి డబ్బంటే ఆసక్తి లేదు..

ది గ్రే మ్యాన్ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా భారత్ లో నిర్వహించాలనుకుంటున్నారు నెట్ ఫ్లిక్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కి గాను డైరెక్టర్స్ రూసో బ్రదర్స్‌ త్వరలో ఇండియాకి రానున్నారు. రూసో బ్రదర్స్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”మేం తెరకెక్కించిన కొత్త సినిమా ‘ది గ్రే మ్యాన్‌’ ని చూడటానికి, మా స్నేహితుడు ధనుష్‌ను చూసేందుకు ఇండియాకు రాబోతున్నాం. ఇందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో ఇండియాలో కలుద్దాం” అని తెలిపారు. దీంతో హాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ఇండియాకి వస్తుండటంతో ఆ సినిమాల అభిమానులు వీరి రాక కోసం ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.