Honey Rose : నాకు నచ్చిన డ్రెస్ లు వేసుకుంటా.. ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలనేది మా ఇష్టం..

వీరసింహరెడ్డి సినిమా తర్వాత హనీరోజ్ కి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తెలుగులో పలు అవకాశాలు కూడా వస్తున్నాయి. తెలుగులో కూడా హనీరోజ్ కి అభిమానులు ఏర్పడ్డారు.

Honey Rose : నాకు నచ్చిన డ్రెస్ లు వేసుకుంటా.. ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలనేది మా ఇష్టం..

honey rose reacts on trolls and her dressing

Honey Rose :  కెరీర్ మొదట్లోనే హనీరోజ్ తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా అనే సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మలయాళంలో(Malayalam) స్టార్ హీరోయిన్(Heroine) గా ఎదిగింది. ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే మరో పక్క స్పెషల్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంది హనీరోజ్(Honey Rose). మలయాళంలో హనీ రోజ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇటీవల సంక్రాంతికి(Sankranthi) వచ్చిన బాలయ్య(Balayya) వీరసింహారెడ్డిలో(Veerasimha Reddy) నటించి తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది హనీ రోజ్.

వీరసింహరెడ్డి సినిమా తర్వాత హనీరోజ్ కి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తెలుగులో పలు అవకాశాలు కూడా వస్తున్నాయి. తెలుగులో కూడా హనీరోజ్ కి అభిమానులు ఏర్పడ్డారు. ఇక షాప్ ఓపెనింగ్స్, ఈవెంట్స్ కి హనీ రోజ్ తెలుగు రాష్ట్రాల్లో బాగానే హాజరవుతుంది. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న హనీరోజ్ బాడీ షేమింగ్స్, హీరోయిన్స్ డ్రెస్సింగ్స్ గురించి మాట్లాడింది.

Rahul Dev : సౌత్ సినిమాల్లో ఇప్పటికి అవే కథలు.. ఏం మారట్లేదు.. స్టార్ విలన్ సంచలన వ్యాఖ్యలు..

హనీ రోజ్ మాట్లాడుతూ.. సినిమాల్లో నా పాత్రకు తగ్గట్టు నా డ్రెస్సింగ్ ఉంటుంది. నాకు నచ్చినట్టు, డైరెక్టర్ చెప్పినట్టు కనపడతాను. ఇక బయట కూడా నాకు నచ్చిన, నాకు కంఫర్ట్ గా ఉండే బట్టలే వేసుకుంటాను. ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది నటీనటుల పర్సనల్ ఛాయిస్. మా బట్టల మీద ఎందుకు ట్రోల్ చేస్తారు. మేము కాస్త బరువు పెరిగినా ట్రోల్ చేస్తారు. బాడీ షేమింగ్ చేస్తారు. నన్నయితే ఒకప్పుడు బాడీ షేమింగ్ చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కొంతమంది చేసే నెగిటివ్ కామెంట్స్ మాకు ఒత్తిడిని కలిగిస్తాయి. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అని తెలిపింది. దీంతో హనీ రోజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.