MAA Elections: మా.. ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్..?

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం.. ప్రెసిడెంట్ ఎన్నికపై ప్రభావం పడే అవకాశం ఉందని సమాచారం.

MAA Elections: మా.. ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్..?

Maa

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం.. ప్రెసిడెంట్ ఎన్నికపై ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసీ మెంబర్ల ఓట్ల లెక్కింపులో 50 వరకు.. ఓట్లు చెల్లలేదని సమాచారం. అయితే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో మంచు విష్ణు ముందంజలో నిలిచారని కౌంటింగ్ కేంద్రం వర్గాలు తెలిపాయి.

అంతకుముందు.. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుపై కౌంటింగ్ అధికారితో ప్రకాష్ రాజ్ వాగ్వాదానికి దిగారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాలని ప్రకాష్ రాజ్ పట్టుబట్టారు. కానీ.. ఎన్నికల అధికారి మాత్రం ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. అయితే.. నిబంధనల ప్రకారం.. లెక్కింపు మొత్తం పూర్తయ్యాకే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కలిపి ఫలితాన్ని ఖరారు చేస్తారని సమాచారం.

ఇదెలా ఉన్నా.. కౌంటింగ్ కేంద్రం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మంచు విష్ణు లీడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read:

MAA Elections: కౌంటింగ్‌లో రచ్చ.. ఎన్నికల అధికారితో ప్రకాష్ రాజ్ గొడవ

MAA Elections: ‘మా’ ఎన్నికల్లో.. ఓటు వేయని బడా హీరోలు వీరే!

MAA Elections: ముగిసిన మా ఎన్నికలు.. ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయంటే?