Taapsee Pannu: భార్య‌పై భర్త రేప్ కేసు తీర్పు.. తాప్సి రియాక్షన్ ఇదే!

ఈ మధ్యనే ఛత్తీస్ ఘడ్ కోర్టు భార్యపై భర్త రేప్ కేసులో కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. భార్యపై భర్త అత్యాచారానికి పాల్పడినట్టు నమోదైన కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చ

Taapsee Pannu: భార్య‌పై భర్త రేప్ కేసు తీర్పు.. తాప్సి రియాక్షన్ ఇదే!

Taapsee Pannu

Taapsee Pannu: ఈ మధ్యనే ఛత్తీస్ ఘడ్ కోర్టు భార్యపై భర్త రేప్ కేసులో కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. భార్యపై భర్త అత్యాచారానికి పాల్పడినట్టు నమోదైన కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. చట్ట ప్రకారం వివాహం చేసుకున్న భార్యతో బలవంతంగా శృంగారం చేస్తే అది అత్యాచారం కాదని.. ఆ కేసులో భర్తను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌కే చంద్రవంశీ ఈ తీర్పును వెలువరించగా.. అదే సమయంలో భర్త అసహజమైన చర్యలను న్యాయమూర్తి తప్పుబట్టారు.

ఈ తీర్పుపై పలువురు సెలబ్రిటీలు స్పందించగా సినీ హీరోయిన్ తాప్సి కూడా స్పందించింది. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్డు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ‘అంతే.. ఇప్పుడు మనం వినాల్సిన వాటిలో ఇది మాత్రమే మిగిలింది’ అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ఇంతకు ముందు దీనిపై ఇక గాయని సోనా మొహపాత్ర కూడా సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ‘ఇది చదివిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దక్షణాది సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా ఉన్న తాప్సి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన సెలబ్రిటీలలో తాప్సి కూడా ఒకరు కాగా సమాజంలో సమస్యలపై ముఖ్యంగా మహిళా సమస్యలపై తాప్సి సోషల్ మీడియా వేదికగా పోరాడుతుంది. ఇదే క్రమంలో ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ తీర్పులో కూడా అసహనం వ్యక్తం చేసింది.