Poonam Kaur: ప్రకాష్ రాజ్ గెలిస్తే నా సమస్యలు బయటపెడతా.. పూనమ్ ట్వీట్!

ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. మరోవైపు మా అసోసియేషన్ ఎన్నికలతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ కాకరేపుతున్న సంగతి తెలిసిందే. పట్టుమని పదిరోజులలో మా ఎన్నికలు ఉండడంతో..

Poonam Kaur: ప్రకాష్ రాజ్ గెలిస్తే నా సమస్యలు బయటపెడతా.. పూనమ్ ట్వీట్!

Poonam Kaur

Poonam Kaur: ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. మరోవైపు మా అసోసియేషన్ ఎన్నికలతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ కాకరేపుతున్న సంగతి తెలిసిందే. పట్టుమని పదిరోజులలో మా ఎన్నికలు ఉండడంతో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వర్గాలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఓట్లు కొల్లగొట్టే పనిలో ఉండగా.. పవన్ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వం నుండి కౌంటర్ అటాక్ ఆపకుండా పేలుతూనే ఉన్నాయి.

Maa Elections: ప్రకాష్ VS విష్ణు.. మధ్యలో పవన్.. కాకరేపుతున్న ఎలక్షన్!

ముందుగా పవన్ వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలో సమస్యల విషయంలో సామరస్యంగా ముందుకెళ్లాలని టాలీవుడ్ నిర్మాతలు ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంటే.. పవన్ వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ మా ఎన్నికలలో అభ్యర్థుల ప్రచారం ఊపు అందుకుంటుంది. ఎవరికి వారు మా ఎన్నికల కోసం ఎత్తుకు పైఎత్తుల వ్యాఖ్యలు చేస్తుంటే.. మిగతా సెలబ్రిటీలు ఎవరికి వారు మద్దతిచ్చే అభ్యర్థులే గెలవాలని ప్రచారం కూడా హాట్ టాపిక్ గా మారుతుంది.

Telugu Movie Releases: ఒకేసారి 6 సినిమాలు.. మూవీ లవర్స్‌కి పండగే!

చిల్లర రాజకీయాలకు దూరంగా ఉండే ప్రకాష్ రాజ్ గెలవాలని కోరుకుకుంటున్నట్లు నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రకాష్ రాజ్ సార్ మాత్రమే అవాస్తవికంగా ఉండేవ్యక్తని, పెద్దలు చెప్పే మాటలను గౌరవించి కట్టుబడి ఉండే వ్యక్తని చెప్పిన పూనమ్.. ప్రకాష్ రాజ్ గెలిస్తే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యలను బయటపెట్టగలని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో పూనమ్ కౌర్ ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలేంటి అన్నది ఇప్పుడు మరోసారి చర్చగా మారింది.