Senapathi: పోలీసోడు గన్ పోగొట్టుకుంటే.. ఉత్కంఠగా సేనాపతి ట్రైలర్!

ఇదేంటో తెలుసా.. సేనాపతి. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి’ అంటూ రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో సేనాపతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా..

Senapathi: పోలీసోడు గన్ పోగొట్టుకుంటే.. ఉత్కంఠగా సేనాపతి ట్రైలర్!

Senapathi

Senapathi: ‘ఇదేంటో తెలుసా.. సేనాపతి. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి’ అంటూ రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో సేనాపతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ వేదికగా ఈ సినిమా ఈ ఏడాదికి చివరి రోజు డిసెంబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ బుధవారం ‘సేనాపతి’ ట్రైలర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ సీరియస్‌ రోల్‌లో కనిపించనున్నారు.

OTT Release: ఇయర్ ఎండ్.. ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!

పవన్‌ సాధినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చిరంజీవి కుమార్తె సుస్మిత, విష్ణు ప్రసాద్‌ నిర్మాతలు. ట్రైలర్‌లో రాజేంద్రప్రసాద్ నటన, సంభాషణలు అదరగొట్టేలా ఉన్నాయి. జీవితంలో మంచి.. చెడు రెండూ చూడాలి.. ఆ రెండింటి మధ్యే ఎదగాలి” అనే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ లో పోలీస్ లకు.. రౌడీలకు మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. ఒక సాధారణమైన వ్యక్తిలా కనిపించే కృష్ణమూర్తి ప్రమాదకరమైన పనులను చక్కబెడుతుంటాడు.

New Film Releases: ఈ ఏడాదికి చివరిరోజు విడుదలయ్యే సినిమాలివే!

కృష్ణమూర్తి .. ఆ తరువాత సేనాపతిగా మారతాడు అనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. కృష్ణమూర్తి సేనాపతిగా ఎందుకు మారతాడు.. ఆయన రహస్యంగా సాగిస్తున్న అన్వేషణ దేని కోసం? అనే అంశాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ ప్రశ్నలను సమాధానం దొరకాలంటే ‘సేనాపతి’ని చూడాల్సిందే. కాగా, క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు రాజేంద్రప్రసాద్ నటన హైలెట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.