TS RTC: బస్ టికెట్ కొంటే.. తిరుమల వెంకటేశ్వరుడి దర్శన టికెట్..

టీఎస్ ఆర్టీసీ తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి వెళ్లే భక్తులు టీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే వారికి బస్సు టికెట్‌తో పాటు తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు టికెట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

TS RTC: బస్ టికెట్ కొంటే.. తిరుమల వెంకటేశ్వరుడి దర్శన టికెట్..

Ts Rtc

TS RTC: టీఎస్ ఆర్టీసీ తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి వెళ్లే భక్తులు టీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే వారికి బస్సు టికెట్‌తో పాటు తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు టికెట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం), టీఎస్ ఆర్టీసీ మధ్య అంగీకారం కుదిరింది. దీంతో ప్రతీ రోజూ రూ. 300 దర్శనానికి సంబంధించి వెయ్యి టికెట్లను టీఎస్ ఆర్టీసీ వెబ్ సైట్ నుండి బుక్  చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. బస్సు టికెట్ తో పాటు అదనంగా రూ. 300 చెల్లించి స్వామివారి దర్శనం టికెట్ ను పొందవచ్చు.

TS RTC : ఆర్టీసీకి రవాణా శాఖ షాక్..తగ్గిపోనున్న బస్సుల సంఖ్య

టీఎస్ ఆర్టీసీ  ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సారథ్యంలో పలు స్కీంలు అమలు చేస్తూ ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టీటీడీతో తాజా ఒప్పందం ఆర్టీసీకి మేలు చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి లక్షలాది మంది వెళ్తారు. స్వామివారి దర్శన టికెట్లు సకాలంలో దొరక్క ఇబ్బందులు పడుతుంటారు.

TS RTC : సంక్రాంతికి రూ.107 కోట్ల ఆదాయం ఆర్జించిన తెలంగాణ ఆర్టీసి

ఈ క్రమంలో టీఎస్ ఆర్టీసీలో రోజు వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంచనుండటంతో తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఆర్టీసీ ప్రయాణీకులు తిరుమల ప్రత్యేక దర్శనానికి రెండు రోజుల ముందు ఆన్ లైన్ పోర్టల్ ద్వారా టికెట్‌ను బుక్ చేసుకోవాలని సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో టీటీడీ టికెట్లు పొందే వీలుంది. అయితే తెలంగాణలో సర్వీస్ చార్జీపై నిర్ణయం తీసుకొని సాప్ట్ వేర్‌ను రూపొందించాక టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభించే తేదీని వెల్లడిస్తామని టీఎస్ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.