Ileana D’Cruz : ప్రెగ్నెన్సీ టైంలో దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు.. కానీ నన్ను అందరూ అదే అడుగుతున్నారు..

ఇటీవల కొన్ని నెలల క్రితం పెళ్లి కాకుండానే తాను ప్రెగ్నెన్సీ అని అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. అయితే దానికి కారణం ఎవరో చెప్పకపోయినా ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తుంది ఇలియానా. తాజాగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ లో ముచ్చటించిన ఇలియానా పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

Ileana D’Cruz : ప్రెగ్నెన్సీ టైంలో దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు.. కానీ నన్ను అందరూ అదే అడుగుతున్నారు..

Ileana D'Cruz comments on Body Weight at the time of Pregnancy

Ileana D’Cruz : పోకిరి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన ఇలియానా ఆ తర్వాత తెలుగులో అందరి హీరోల సరసన నటించింది. సౌత్ లో కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ చెక్కేసింది ఈ భామ. టాలీవుడ్ లో జీరో సైజ్ కి శ్రీకారం చుట్టి అప్పట్లో సన్నగా ఉండి బాగా వైరల్ అయింది ఇలియానా. ఇక బాలీవుడ్ లో అంతగా వర్కౌట్ అవ్వకపోవడంతో ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసింది.

ఇటీవల కొన్ని నెలల క్రితం పెళ్లి కాకుండానే తాను ప్రెగ్నెన్సీ అని అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. అయితే దానికి కారణం ఎవరో చెప్పకపోయినా ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తుంది ఇలియానా. తాజాగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ లో ముచ్చటించిన ఇలియానా పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఒకప్పుడు జీరో సైజ్ మెయింటైన్ చేసిన ఇలియానా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ బొద్దుగా తయారయింది. గతంలోనే ఇలియానా బరువు గురించి పలువురు కామెంట్స్ చేశారు.

Samantha : జీవితాంతం ప్రేమించే వ్య‌క్తి అత‌నే.. మంచి వ్య‌క్తికి వంద‌రెట్లు ఎక్కువ.. పిక్ షేర్ చేసిన స‌మంత

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు బరువు పెరుగుతారని తెలిసిందే. తాజాగా ఓ నెటిజన్ ఇదే అడిగాడు. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరుగుతున్నందుకు బాధపడుతున్నారా అని అడిగారు ఓ నెటిజన్. దీనికి ఇలియానా సమాధానమిస్తూ.. మొదట్లో ఈ ప్రశ్న నన్ను బాధపెట్టింది. కానీ ప్రెగ్నెన్సీ టైంలో బరువు పెరగడం చాలా కామన్. కానీ అందరూ దీనిపైనే కామెంట్స్ చేస్తారు. దాంతో మనం బరువు పెరుగుతున్నామనే భావన క్రియేట్ చేస్తారు. గత కొన్ని నెలలుగా మారిన నా శరీరాకృతికి నేను సంతోషిస్తున్నాను. ఇలాంటి మాటలు మాట్లాడి నాలో ఒక జీవం పెరుగుతుందని అందరూ నాకు గుర్తు చేస్తున్నారు. అది నాకు మంచిదే. కానీ నేను బరువు గురించి ఆలోచించాను. ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటివి ఆలోంచించకూడదు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి అని చెప్పింది.