Ileana D’Cruz : పండంటి బాబుకి జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా? బాబుని చూశారా?

ఇలియానా డెలివరీ అయింది. ఆగస్టు 1న ఇలియానా పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఇలియానా తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన బాబు ఫోటోని కూడా పోస్ట్ చేసింది.

Ileana D’Cruz : పండంటి బాబుకి జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా? బాబుని చూశారా?

Ileana DCruz Delivered a baby boy and post his photo with name fans and celebrities says congrats

Ileana D’Cruz : ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా కొన్ని నెలల క్రితం పెళ్లి కాకుండానే తాను ప్రెగ్నెన్సీ అని అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే ప్రగ్నెన్సీ, దానికి కారణం ఎవరో చెప్పకపోవడంతో అభిమానులు, నెటిజన్లు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఒక అబ్బాయితో దిగిన సెల్ఫీ ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి డేట్ నైట్ అని రాసి లవ్ సింబల్ వేసింది. దీంతో ఇలియానా బాయ్ ఫ్రెండ్ అతనే, తన ప్రెగ్నెన్సీకి కారణం అతనే అని కామెంట్స్ చేశారు పలువురు నెటిజన్లు. అతను ఓ విదేశీయుడు కావడం గమనార్హం.

ఇలియానా డెలివరీ అయింది. ఆగస్టు 1న ఇలియానా పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఇలియానా తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన బాబు ఫోటోని కూడా పోస్ట్ చేసింది. తన బాబుకి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ అనే పేరు పెట్టినట్టు ప్రకటించింది. ఈ పేరు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నా బాబు మాత్రం క్యూట్ గా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. తన బాబు ఫోటోని షేర్ చేస్తూ.. మేము ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో చెప్పలేకపోతున్నాను. ఈ ప్రపంచంలోకి నా బాబుకి స్వాగతం అని పోస్ట్ చేసింది.

Jailer : అమెరికా టైమ్స్ స్క్వేర్‌ను స్వాధీనం చేసుకున్న సూప‌ర్‌స్టార్.. న్యూయార్క్‌లో జైల‌ర్ జ్వ‌రం..

ఇక అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కంగ్రాట్స్ చెప్తూనే బాబు తండ్రి ఎవరో ఇప్పటికైనా అధికారికంగా చెప్పమని కామెంట్స్ చేస్తున్నారు. ఎలాగో ఇలియానా బాయ్ ఫ్రెండ్ విదేశీయుడు అని బాబు పేరుతో మరోసారి క్లారిటీ వచ్చేసింది. దీంతో అతన్ని కూడా పరిచయం చేయమని అడుగుతున్నారు.

View this post on Instagram

A post shared by Ileana D'Cruz (@ileana_official)