Sarkaru Vaari Paata: పెరిగిన ఎస్‌వీపీ ప్రమోషన్ స్పీడ్.. ఇక మాస్ జాతరే

Sarkaru Vaari Paata: పెరిగిన ఎస్‌వీపీ ప్రమోషన్ స్పీడ్.. ఇక మాస్ జాతరే

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సర్కార్ వారి పాట రిలీజ్ కి టైమ్‌ దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు. సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న మహేశ్ ఫ్యాన్స్‌కి సర్కార్ వారి పాట నుంచివచ్చే అప్ డేట్స్ మంచి కిక్ ఇస్తున్నాయి. గ్లింప్స్, టీజర్, సాంగ్స్, ఆల్రెడీ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటే ఇప్పుడు ఇంటర్య్వూస్‌ కూడా మొదలు పెట్టి సినిమాపై ఇంకా హైప్ క్రియేట్ చేస్తున్నారు టీమ్.

Sarkaru Vaari Paata: ట్రైలర్‌లోనే క్లారిటీ ఇస్తానంటోన్న మహేష్!

వరల్డ్ వైడ్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సర్కార్ వారి పాట సినిమా మే12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. మహేశ్ బాబు, కీర్తి సురేష్ నటించిన ఈ సినిమాను పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. సాఫ్ట్ లవ్ స్టోరీస్ లో మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఇన్ క్లూడ్ చేసి, సక్సెస్ కొట్టే డైరెక్టర్ పరుశురామ్. ఇప్పుడు అవుటండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎలివేషన్స్ తో ఈ సినిమా చేయడంతో ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేసింది సర్కార్ వారి పాట. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది. ఇప్పటికే రిలీజైన కళావతి, పెన్నీ, టైటిల్ ట్రాక్ లు ఆల్ టైమ్ రికార్డు స్తాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. ఒకటి కాదు రెండు సినిమాలు!

ఇప్పటికే రిలీజ్ అయిన యాంగ్రీ లుక్ లో రౌడీలను ఇరగదీస్తున్న మహేశ్ బాబు లుక్ ఫ్యాన్స్ ను కిర్రెక్కిస్తోంది. ఆ లుక్ ఫ్యాన్స్ కు కామన్ డీపీగా, ప్రొఫైల్ పిక్ గా మారిపోయింది. థీమ్ కు తగినట్టుగానే ట్రయిలర్ రేపు మే రెండో తారీఖున రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. ఇక మహానటి కీర్తి సురేష్ కూడా సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కూడా ట్రెండింగ్ లో వెళ్తోంది.

Sarkaru Vaari Paata: ప్రమోషన్లు షురూ.. రంగంలోకి దిగనున్న మహేష్!

కీర్తిసురేష్ తో పాటు ఫారెన్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని మహేష్ బాబు కూడా డైరెక్ట్ ప్రమోషన్స్ లో దిగడానికి రెడీ అవుతున్నారు. మే 2న ఇక ట్రయిలర్ రిలీజ్ అయిన తర్వాత, రీసెంట్ గా మహేశ్, కీర్తి కాంబినేషన్ లో తెరకెక్కించిన మాస్ పాటను నాలుగో పాటగా రిలీజ్ చేయబోతుంది టీమ్. ఇలా వరసగా మాస్, మెలోడీ సాంగ్స్ రీలీజ్ చేసి, సినిమా రిలీజ్ వరకు నాన్ స్టాప్ ప్రమోషన్స్ తో మహేశ్ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.