Rohit Sharma: ఆ జాబితాలో 8వ వాడిగా నిలిచిన రోహిత్ శర్మ

లండన్‌లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా నాలుగో టెస్టులో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా ఆడుతున్న సెకండ్ ఇన్నింగ్స్ లో 15వేల పరుగులు....

Rohit Sharma: ఆ జాబితాలో 8వ వాడిగా నిలిచిన రోహిత్ శర్మ

Rohit Sharma

IND vs ENG: లండన్‌లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా నాలుగో టెస్టులో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా ఆడుతున్న సెకండ్ ఇన్నింగ్స్ లో 15వేల పరుగులు చేయగలిగాడు. ఈ ఫీట్ సాధించిన ఎనిమిదో ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ లో 34వేల 357పరుగులు చేసి ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో నిలిచాడు. రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, మొహమ్మద్ అజారుద్దీన్ 15వేల పరుగులు చేసిన జాబితాలో ఉన్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి లీడింగ్ రన్ గెట్టర్ గా దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ.

రోహిత్ శర్మ అంతర్జాతీయ పరుగులలో వన్డే ఫార్మాట్లోనే ఎక్కువగా స్కోర్ చేశాడు. 227 మ్యాచ్ లలో 9వేల 205వన్డే పరుగులు నమోదు చేశాడు.