Virat Kohli : ఈ రోజు నాకు వ్య‌క్తిగ‌తంగా కూడా ఎంతో ప్ర‌త్యేకం.. చిన్న‌ప్పుడు ఏం చేసేవాడినంటే..?

దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి దేశ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Virat Kohli : ఈ రోజు నాకు వ్య‌క్తిగ‌తంగా కూడా ఎంతో ప్ర‌త్యేకం.. చిన్న‌ప్పుడు ఏం చేసేవాడినంటే..?

Kohli on Independence Day

Kohli on Independence Day : దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్స‌వ (Independence Day) వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి (Virat Kohli) దేశ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ రోజు ప్రాముఖ్య‌త‌ను గుర్తు చేయ‌డంతో పాటు ఈ రోజుతో వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌ని చెప్పారు.

మ‌న దేశ చ‌రిత్ర‌లో స్వాతంత్య్ర దినోత్స‌వం అతి ముఖ్య‌మైన రోజు. మ‌నం గ‌ర్వించాల్సిన రోజు. అంద‌రికి ఎంతో ముఖ్య‌మైన ఈ రోజు నాకు వ్య‌క్తిగ‌తంగా ఎంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే ఇది మా నాన్న పుట్టిన రోజు. ఈ రెండు సంద‌ర్భాలు ఒకే రోజు జ‌రుపుకోవ‌డం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. చిన్న‌ప్పుడు స్వాతంత్య్ర దినోత్స‌వం జ‌రుపుకున్న సంద‌ర్భాల్లో నాకు ఎన్నో మధుర‌మైన జ్ఞాప‌కాలు ఉన్నాయి. ఈ రోజున గాలిప‌టాలు ఎగుర‌వేయ‌డం ఢిల్లీలో ఆన‌వాయితీ. ఇందుకోసం కావాల్సిన వ‌స్తువుల‌ను ముందురోజు రాత్రి సిద్ధం చేసుకునే వాళ్లం. ఇది నాకు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని ఓ మ‌ధుర జ్ఞాప‌కం అంటూ విరాట్ కోహ్లి చెప్పాడు.

Team India : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఓట‌మి.. భార‌త్ ఖాతాలో చేరిన చెత్త రికార్డులు ఇవే..

ఇటీవ‌ల‌ ముగిసిన వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో కోహ్లి రాణించాడు. అయితే.. వ‌న్డే సిరీస్‌లో యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం కోసం త‌ప్పుకున్నాడు. టీ20 సిరీస్ కూడా ఆడ‌లేదు. ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న నుంచి కోహ్లికి విశ్రాంతి ఇవ్వ‌డంతో ఆసియా క‌ప్‌లోనే మ‌ళ్లీ కోహ్లిని మైదానంలో చూసే అవ‌కాశం ఉంది. సెప్టెంబ‌ర్ 2న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌తో శ్రీలంక‌లోని ప‌ల్లెక‌లెలో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి శ‌త‌కం చేయాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

BCCI Twitter DP : ప్ర‌ధాని పిలుపు.. బ్లూ టిక్ కోల్పోయిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా..?