Indraani : ఇండియన్ ఫస్ట్ సూపర్ ఉమెన్ ‘ఇంద్రాణి’

తాజాగా మొదటి సారిగా ఇండియా ఫస్ట్ సూపర్ ఉమెన్ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమా తెలుగులో నిర్మించడం విశేషం. తెలుగులో మొదటి సూపర్‌ ఉమెన్ సినిమాగా 'ఇంద్రాణి' తెరకెక్కుతుంది.

Indraani : ఇండియన్ ఫస్ట్ సూపర్ ఉమెన్ ‘ఇంద్రాణి’

Indraani

Indraani :   హాలీవుడ్ లో సూపర్ హీరోస్, సూపర్ ఉమెన్స్ సినిమాలు వస్తూ ఉంటాయి. అక్కడ ఇలాంటి సినిమాలు సర్వ సాధారణం. మార్వెల్, డిసి సిరీస్ లలో ఈ సూపర్ హీరోలు, హీరోయిన్లు ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి ప్రపంచాన్ని కాపాడే అన్ని శక్తులు ఉంటాయి. ఈ పాత్రలు హాలీవుడ్ లో బాగా క్లిక్ అయ్యాయి. ఇలాంటి పాత్రలు ఇండియన్ సినీ పరిశ్రమలో చాలా తక్కువ. శక్తిమాన్, క్రిష్ లాంటి సూపర్ హీరో పాత్రలు ఉన్న కొని సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఇండియన్ సినీ పరిశ్రమలో సూపర్ ఉమెన్ పాత్రలు ఉన్న సినిమాలు రాలేదు. తాజాగా మొదటి సారిగా ఇండియా ఫస్ట్ సూపర్ ఉమెన్ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమా తెలుగులో నిర్మించడం విశేషం.

Ram Gopal Varma: సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వంతో రామ్ గోపాల్ వర్మ చర్చలు

తెలుగులో మొదటి సూపర్‌ ఉమెన్ సినిమాగా ‘ఇంద్రాణి’ తెరకెక్కుతుంది. వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై స్టాన్లీ సుమన్‌ బాబు నిర్మాతగా స్టీఫెన్ డైరెక్టర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను నిన్న మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవ్వబోతుందని తెలిపారు. త్వరలో ఈ సినిమా గురించి అన్ని వివరాలు ప్రకటిస్తామని తెలిపారు చిత్ర బృందం.