Instagram Account : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ ఈజీగా డిలీట్ చేయొచ్చు!

Instagram Account : ప్రముఖ ఫొటోషేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి మీ ఫోన్లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ నుంచి నేరుగా అకౌంట్ డిలీట్ చేసుకోవచ్చు.

Instagram Account : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ ఈజీగా డిలీట్ చేయొచ్చు!

Instagram Never Allowed Users To Delete Their Account From The App, But Now Ios Users Can

Instagram Account : ప్రముఖ ఫొటోషేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకనుంచి మీ ఫోన్లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ నుంచి నేరుగా అకౌంట్ డిలీట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ ఇన్‌స్టా యూజర్లకు అందుబాటులో లేదు. అయితే Apple యాప్ స్టోర్ లేటెస్ట్ మార్గదర్శకాలకు అనుగుణంగా.. Instagram ఇప్పుడు యాప్ నుంచి నేరుగా Instagram అకౌంట్ డిలీట్ చేసే ఆప్షన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. Apple ఇటీవల యాప్ స్టోర్ మార్గదర్శకాలను అప్ డేట్ చేసింది.

తద్వారా యాప్‌లో అకౌంట్ క్రియేషన్ అందించే అన్ని యాప్‌లకు యాప్ నుంచి అకౌంట్ డిలీట్ చేసే ఆప్షన్ కూడా చేర్చడాన్ని తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అకౌంట్ డిలీట్ చేసేందుకు సుదీర్ఘమైన ప్రక్రియను ఫాలో కావాల్సి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ల అనుభవాన్ని ఆధారాంగా చేసుకుని వారికి మరిన్ని మార్గాలను అందించాలని కంపెనీ భావిస్తోంది. iOSలోని సెట్టింగ్‌లలో అకౌంట్ డిలీట్ చేసే ఆప్షన్ ఎంచుకునే ముందు మీ అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేసేందుకుఈ కొత్త ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మెటా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

Instagram Never Allowed Users To Delete Their Account From The App, But Now Ios Users Can (1)

Instagram Never Allowed Users To Delete Their Account From The App, But Now Ios Users Can 

మీ Instagram అకౌంట్ డిలీట్ చేయడానికి మీరు మొబైల్ డెస్క్‌టాప్‌లోని వెబ్ బ్రౌజర్ ద్వారా మీ Instagramని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో అకౌంట్ డిలీట్ ఆప్షన్ అందుబాటులో లేదు. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు iOS యాప్‌లో ఈ ఆప్షన్రిలీజ్ చేయనున్నట్టగ తెలిపింది. మీరు యాప్ నుంచి మీ అకౌంట్ మాత్రమే డియాక్టివేట్ చేయగలరని గుర్తించుకోండి. కానీ, మీ డేటా Instagram సర్వర్‌లలోనే స్టోర్ అయి ఉంటుంది. యూజర్లు తమ అకౌంట్ వినియోగించినా లేకపోయినా వారి డేటా Instagram సర్వర్‌లలో స్టోర్ అవుతుందనే విషయాన్ని గుర్తించరు. అలాగే తమ అకౌంట్లను డిలీట్ చేసేస్తుంటారు.

Apple App Store మార్గదర్శకాలు అప్‌డేట్ చేసిన తర్వాత యాప్‌లో తమ అకౌంట్ డిలీట్ చేసేందుకు యూజర్లకు అనుమతించడానికి అన్ని యాప్‌లను తప్పనిసరి చేసింది. యాప్ నుంచి అకౌంట్ డిలీట్ చేసినప్పుడు డెవలపర్ చట్టబద్ధంగా నిర్వహించాల్సిన అవసరం లేని అకౌంట్‌తో లింక్ అయినా ఏదైనా డేటాతో పాటు డెవలపర్ రికార్డ్‌ల నుంచి అకౌంట్ డిలీట్ అవుతుందని Apple సపోర్టు పేజీలో పేర్కొంది. ఇన్‌స్టా‌గ్రామ్‌లో షేర్ చేసిన వ్యక్తిగత డేటాపై నియంత్రణ ఉంటుంది. మీరు యాప్‌ని అప్‌డేట్ చేయడం లేదా అకౌంట్ క్రియేషన్‌తో కొత్త యాప్‌ను సమ్మిట్ చేస్తుంటే.. దయచేసి రివ్యూలో ఆలస్యం కాకుండా ఉండేలా కింది గైడెన్స్‌ని ఓసారి చదవాలని Apple సూచించింది. యాప్‌లో అకౌంట్ డిలీట్ ప్రాసెస్ సులభతరం చేసేందుకు యాప్ అకౌంట్ సెట్టింగ్‌లలో యాప్‌లను లింక్ చేసింది.

Read Also :  Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో వయస్సు వెరిఫికేషన్‌కు మూడు ఆప్షన్లు.. సెల్ఫీ వీడియో పంపాల్సిందే!