Delhi Suns : ఢిల్లీలో భానుడి భగభగలు.. ఉదయం 7 గంటలకే 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

మంగళవారం గరిష్టంగా 41 డిగ్రీలు, కనిష్టంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోడవుతాయని అంచనా వేశారు. సాయంత్రం 6-7 గంటలకు వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది.

Delhi Suns : ఢిల్లీలో భానుడి భగభగలు.. ఉదయం 7 గంటలకే 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Intense sun

Intense sun : దేశ రాజధాని ఢిల్లీలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడు భగభగ మండుతున్నాడు. హస్తినలో ఎండలు దంచికొడుతున్నాయి. తీవ్ర ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 7 గంటలకే 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

నేడు (మంగళవారం) గరిష్టంగా 41 డిగ్రీలు, కనిష్టంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోడవుతాయని అంచనా వేశారు. సాయంత్రం 6-7 గంటలకు వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది. మరో ఐదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.

Bhopal: ప్రభుత్వ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి ఆర్మీ.. బీజేపీ కుట్రలో భాగమేనంటూ కాంగ్రెస్ విమర్శలు

ఎండ ప్రభావం, వడగాలులతో బయటకి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లేపుడు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఐఎండీ సూచించింది.