NTR30: ఎన్టీఆర్ సినిమాపై కొత్త బజ్.. నిజంగానే అలాంటి పాత్ర ఉంటుందా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత చేస్తున్న NTR30 ప్రాజెక్ట్ ఇప్పటికే అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. కాగా, ఈ సినిమాలో జాన్వీ కపూర్ తో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందని.. ఆమె పాత్ర ఇదేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

NTR30: ఎన్టీఆర్ సినిమాపై కొత్త బజ్.. నిజంగానే అలాంటి పాత్ర ఉంటుందా..?

Interesting Buzz On A Role In NTR30 Movie

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత చేస్తున్న NTR30 ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా కథను సముద్రం నేపథ్యంలో కొరటాల రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

NTR30: వస్తున్నా.. అంటూ అలా వచ్చి ఇలా ముగించేసిన తారక్!

కాగా, ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఫోకస్ పెట్టారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో, తారక్‌తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో జాన్వీ కపూర్‌తో పాటు మరో హీరోయిన్ కూడా ఉండబోతుందని.. సెకండ్ హీరోయిన్ పాత్రలో ఆమె నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అంతేగాక, ఈ సినిమాలో ఆమె పాత్ర ఓ జాలరి కూతురిగా ఉంటుందని తెలుస్తోంది.

NTR30: చీకట్లో విలన్లను చెడుగుడు ఆడేస్తున్న తారక్..!

సముద్రం నేపథ్యంలో సాగే కథ కావడంతో, నిజంగానే సెకండ్ హీరోయిన్ పాత్ర ఇదేనేమో అనే టాక్ అభిమానుల్లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కోసం తారక్ కూడా చాలా మేకోవర్ అవుతున్నాడట. ఈ సినిమాలో ఆయన లుక్ కూడా సరికొత్తగా ఉంటుందని.. తారక్‌ను చూసి అభిమానులు పండగ చేసుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి నిజంగానే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర జాలరి కూతురిగా ఉంటుందా అనే వార్తపై క్లారిటీ రావాలంటే, మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.