KTR – Sudheerbabu: కేటీఆర్ మంచి లీడరే కాదు.. మంచి యాక్టర్ కూడా..!

హైదరాబాద్ లో జరిగిన ఇండియాజాయ్ కార్యక్రమంలో.. మంత్రి కేటీఆర్, సినీ నటుడు సుధీర్ బాబు మధ్య.. లీడర్, యాక్టర్ టాపిక్ పై ఆసక్తికర చర్చ జరిగింది.

KTR – Sudheerbabu: కేటీఆర్ మంచి లీడరే కాదు.. మంచి యాక్టర్ కూడా..!

Sudheerbabu Ktr

KTR – Sudheerbabu: హైదరాబాద్ లో జరిగిన ఇండియాజాయ్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అందులో సినీ నటుడు సుధీర్ బాబు కూడా ఉన్నారు. ఇండియా జాయ్ గురించి మాట్లాడుతూ.. కేటీఆర్ పై సుధీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంచి పొలిటీషియన్ కావాలంటే.. మంచి యాక్టర్ కూడా కావాలని.. అలా కేటీఆర్ మంచి యాక్టర్ కూడా అని అన్నారు.

ఇది తాను చాలా పాజిటివ్ గా ఆలోచించే చెబుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తే.. కేటీఆర్ లా సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తానని.. తాను కేటీఆర్ కు పెద్ద అభిమానినని చెప్పుకొచ్చారు. కేటీఆర్ సినిమాల్లోకి రానందుకు తనకు ఆనందంగా ఉన్నట్టు చెప్పారు. అయితే.. మంచి పొలిటీషియన్.. మంచి యాక్టర్ అన్న సుధీర్ కామెంట్లపై కేటీఆర్ నవ్వుతూ రియాక్టయ్యారు. ఇది ఎలా కాంప్లిమెంట్ అవుతుందని అడిగారు.

కేటీఆర్ రిప్లైకి స్పందించిన సుధీర్.. తాను నటుడిగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే.. నిజ జీవితానికి సంబంధించిన ఇతర విషయాలను మరిచిపోయి నటించాల్సి ఉంటుందని.. అప్పుడే తాను నటుడిగా సక్సెస్ అవడమే కాక.. ప్రేక్షకులు కోరిన ఔట్ పుట్ ఇవ్వగలుగుతానని అన్నారు. అలాగే.. రాజకీయ నాయకుడు కూడా నిజ జీవితానికి సంబంధించినవి అన్నీ మరిచిపోతేనే.. నాయకుడిగా విజయవంతం అవుతారని.. అలా కేటీఆర్ సక్సెస్ అయ్యారని క్లారిటీ ఇచ్చుకున్నారు.

ఆ తర్వాత ప్రసంగించిన కేటీఆర్.. సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన చేసిన కామెంట్స్ ను గుర్తు పెట్టుకుంటానంటూ సరదాగా కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలను పాజిటివ్ గానే తీసుకుంటున్నానని.. ధన్యవాదాలని.. అన్నారు కేటీఆర్. ఈ టాపిక్ తో ఇండియాజాయ్ కార్యక్రమానికి హాజరైన వాళ్లంతా సరదాగా కాసేపు నవ్వుకున్నారు.