Sankranti 2022: సంక్రాంతికి ధియేటర్లో సినిమాల దండయాత్ర!

ఈ సంవత్సరం స్టార్ల మధ్య కాంపిటీషన్ పర్వాలేదనిపించినా.. నెక్ట్స్ ఇయర్ మాత్రం అస్సలు తగ్గేదే లేదంటున్నారు హీరోలు. సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి ధియేటర్లో సినిమాల దండయాత్ర జర

Sankranti 2022: సంక్రాంతికి ధియేటర్లో సినిమాల దండయాత్ర!

Sankranti 2022

Sankranti 2022: ఈ సంవత్సరం స్టార్ల మధ్య కాంపిటీషన్ పర్వాలేదనిపించినా.. నెక్ట్స్ ఇయర్ మాత్రం అస్సలు తగ్గేదే లేదంటున్నారు హీరోలు. సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి ధియేటర్లో సినిమాల దండయాత్ర జరగబోతోంది. సంక్రాంతికి ఇప్పటికి అఫీషియల్ గా 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ ఫిక్స్ అయిన డేట్స్ ప్రకారం సంక్రాంతి ఫైట్ ని స్టార్ట్ చేసేది పవన్ కళ్యాణే.

Big Boss 5: లేస్తే హగ్.. కూర్చుంటే హగ్.. పడుకుంటే హగ్.. బిగ్‌బాసంటే హగ్‌లేనా?

భీమ్లానాయక్ తో పండగ నేను స్టార్ట్ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటే.. సర్కారు వారి పాటతో మహేష్ బాబు, ఫన్, ఫ్రస్టేషన్ తో వెంకటేష్, రెట్రో లవ్ స్టోరీతో ప్రభాస్ రిలీజ్ బరిలోకి దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా భీమ్లానాయక్ సినిమాతో జనవరి 12న సంక్రాంతి సందడిని పెంచడానికే ఫిక్స్ అయ్యారు. పోయిన సంవత్సరం సంక్రాంతికి సరిలేరునీకెవ్వరు సినిమాతో సూపర్ సక్సెస్ అయిన మహేష్ బాబు సర్కారు వారి పాటను జనవరి 13న స్టార్ట్ చేస్తున్నారు.

Naga Chaitanya-Samantha: ఫస్ట్ టైమ్ చైతూ డిస్టర్బ్.. మాటల్లో చూపించేశాడు!

ప్యాన్ ఇండియా రేంజ్ లో జనవరి 14న రిలీజ్ అవుతున్న రాధేశ్యామ్ కోసం ఈగర్ గా మూడేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. మన సినిమాలకే స్పేస్ లేక, ధియేటర్లు సరిపోక, ఎక్కడ అక్యుపై చెయ్యాలో తెలీక స్టార్లు, ప్రొడ్యూసర్లు సతమతమవుతుంటే.. ఈ టైట్ షెడ్యూల్ లో తమిళ్ స్టార్ హీరో అజిత్ కూడా సంక్రాంతి బరిలోకి యాడ్ అయ్యారు.

Telugu Upcoming Films: ఫుల్ బిజీగా ఫెస్టివల్ సీజన్.. టఫ్ ఫైట్ తప్పేలా లేదు!

అజిత్ హీరోగా, కార్తికేయ విలన్ గా తెరకెక్కుతున్న రేసింగ్ యాక్షన్ డ్రామా వలిమై సంక్రాంతికి రిలీజ్ చెయ్యబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు వలిమై టీమ్. ఇలా ఫెస్టివల్స్ అన్నీ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయి.. ధియేటర్లు స్టార్ వార్ కోసం వెయిట్ చేస్తుంటే మరోవైపు బాక్సాఫీసులు కలెక్షన్లకోసం వెయిట్ చేస్తున్నాయి.