IPL 2022: అలా చూస్తే ఎంఎస్ ధోనీ.. దినేశ్ కార్తీక్ సమానమే

ఆర్సీబీ యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడిన బెంగళూరు జట్టు కెప్టెన్ డుప్లెసిస్.. దినేశ్ కార్తీక్ పై ప్రశంసలు కురిపించేస్తున్నాడు. గత సీజన్ వరకూ చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన డుప్లెసిస్..

IPL 2022: అలా చూస్తే ఎంఎస్ ధోనీ.. దినేశ్ కార్తీక్ సమానమే

Ms Dhoni (1)

IPL 2022: రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు మంగళవారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో దినశ్ కార్తీక్ కీలకంగా నిలిచాడు. 12.3ఓవర్ల వద్ద 87/5స్కోరుతో ఉన్న జట్టుకు 169 పరుగుల లక్ష్యం అసాధ్యంగా మారింది.

అటువంటి కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్.. షెబాజ్ అహ్మద్ తో కలిసి విజృంభించాడు. 23బంతుల్లో (7ఫోర్లు, ఒక సిక్సు) బాది 44పరుగులు నమోదు చేశాడు. మరో ఎండ్ లో ఉన్న షెబాజ్ అహ్మద్ 26బంతుల్లో 45పరుగులు చేశాడు. అలా 5.2ఓవర్లలో 67పరుగులు నమోదు చేసింది ఆర్సీబీ.

టోర్నమెంట్ ను ఓటమితో ఆరంభించిన బెంగళూరు జట్టు.. రాజస్థాన్, కోల్‌కతాలతో రెండు విజయాలు అందుకుని ఊపందుకుంది. ఈ సందర్భంగా ఆర్సీబీ యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడిన బెంగళూరు జట్టు కెప్టెన్ డుప్లెసిస్.. దినేశ్ కార్తీక్ పై ప్రశంసలు కురిపించేస్తున్నాడు. గత సీజన్ వరకూ చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన డుప్లెసిస్.. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫినిషింగ్ కు దినేశ్ కార్తీక్ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని చెప్తున్నాడు.

Read Also: దినేశ్ కార్తీక్‌కు డబుల్ ధమాకా.. దీపికా పల్లికల్‌కు కవలలు

‘గేమ్ లో బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న ధోనీకి.. దినేశ్ కార్తీక్ కు మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ప్రత్యర్థి జట్టులో ఉన్నప్పుడు దినేశ్ కార్తీక్ తో ఆడాను. అతను చాలా డేంజరస్ ప్లేయర్’ అని డుప్లెసిస్ కామెంట్ చేశారు.