IPL 2022: కోహ్లీని అవుట్ చేసిన చాహల్.. ట్విట్టర్లో మీమ్స్ వెల్లువ

స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఏప్రిల్ 5 మంగళవారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఆడాడు. రాజస్థాన్ కు ప్రాతినిధ్యం వహించిన చాహల్.. ఆర్సీబీ మాజీ..

IPL 2022: కోహ్లీని అవుట్ చేసిన చాహల్.. ట్విట్టర్లో మీమ్స్ వెల్లువ

Chahal (1)

IPL 2022: స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఏప్రిల్ 5 మంగళవారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఆడాడు. రాజస్థాన్ కు ప్రాతినిధ్యం వహించిన చాహల్.. ఆర్సీబీ మాజీ కెప్టెన్ వికెట్ పడగొట్టడం ఆశ్చర్యంగా అనిపించింది.

2014 నుండి RCBతో అసోసియేట్‌గా ఉన్న చాహల్‌ను RCB ఆశ్చర్యకరంగా IPL 2022 మెగా వేలంలో కొనుగోలు చేయలేదు. దీంతో చివరికి రాజస్థాన్ రాయల్స్ రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈ మ్యాచ్ లో RCBచేతిలో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. చాహల్ అద్భుతమైన స్పెల్‌ను అందించి 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కూడా చాహల్ అకౌంట్ లోనే వేసుకున్నాడు.

Read Also: కోహ్లీ రికార్డుకు 4పరుగుల దూరంలో రోహిత్ శర్మ

సంజు శాంసన్, చాహల్ అత్యుత్తమ ఫీల్డింగ్ కారణంగా కోహ్లీ రనౌట్ అయ్యాడు. ఎనిమిదో ఓవర్, రీప్లేలో కోహ్లి తన క్రీజులో తక్కువగా ఉన్నాడని స్పష్టం కావడంతో ఔట్ ఇచ్చారు అంపైర్లు. కోహ్లిని ఔట్ చేయడానికి చాహల్ చేసిన ప్రయత్నాలు ట్విట్టర్‌లో మీమర్స్ కు బాగా పనిచెప్తున్నాయి.

చాహల్ బెంగుళూరు టీం కాకపోవడంతో స్నేహితులు శత్రువులుగా మారారు అంటూ ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు. లెగ్ స్పిన్నర్ యొక్క అద్భుతమైన ప్రయత్నాలు చివరికి ఫలించలేదు. RCB మరో 5 బంతులు మిగిలి ఉండగానే 170 పరుగులను ఛేదించింది.