IPL 2023, DC vs KKR: కోల్‌క‌తా పై ఢిల్లీ విజ‌యం..Updates

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది.

IPL 2023, DC vs KKR: కోల్‌క‌తా పై ఢిల్లీ విజ‌యం..Updates

DC vs KKR

IPL 2023, DC vs KKR:ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. కోల్‌క‌తా నిర్దేశించిన 128 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ 19.2 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 127 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జ‌ట్టు : జాసన్ రాయ్, లిట్టన్ దాస్(వికెట్ కీప‌ర్‌), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్‌), మన్‌దీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, కుల్వంత్ ఖేజ్రోలియా, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి

ఢిల్లీ క్యాపిట‌ల్స్ తుది జ‌ట్టు : డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్జే, ఇషాంత్ శర్మ‌

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 21 Apr 2023 12:20 AM (IST)

    ఢిల్లీ బోణీ

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. కోల్‌క‌తా నిర్దేశించిన 128 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ 19.2 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

  • 20 Apr 2023 11:41 PM (IST)

    వార్న‌ర్ ఔట్‌

    వ‌రుణ్ చ‌క్ర‌వర్తి వేసిన 13.1ఓవ‌ర్‌లో వార్న‌ర్(57) ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

  • 20 Apr 2023 11:28 PM (IST)

    వార్న‌ర్ అర్థ‌శ‌త‌కం

    అనుకుల్ రాయ్  వేసిన 10.2 ఓవ‌ర్‌కు వార్న‌ర్ ఫోర్ కొట్టి 34 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు.

  • 20 Apr 2023 11:23 PM (IST)

    సాల్ట్ ఔట్‌

    ఢిల్లీ మ‌రో వికెట్ కోల్పోయింది. అనుకుల్ రాయ్ వేసిన 8.1 ఓవ‌ర్‌కు సాల్ట్‌(5) బౌల‌ర్‌కే రిట‌ర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 67 ప‌రుగుల వ‌ద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది.

  • 20 Apr 2023 11:20 PM (IST)

    మిచెల్ మార్ష్ ఔట్‌

    పార్ట్ టైమ్ బౌల‌ర్ నితీశ్ రాణా వేసిన 7.2 ఓవ‌ర్‌కు మిచెల్ మార్ష్‌(2) వైసీచేతికి చిక్కాడు. దీంతో కోల్‌క‌తా రెండో వికెట్ కోల్పోయింది.

  • 20 Apr 2023 11:09 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    వార్న‌ర్ దూకుడుగా ఆడుతున్నాడు. సునీల్ న‌రైన్ వేసిన ఆరో ఓవ‌ర్‌లో నాలుగు ఫోర్లు బాదాడు. ఈ ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 61/1. వార్న‌ర్‌(45), మిచెల్ మార్ష్ (1) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 11:02 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    ఢిల్లీ క్యాపిట‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. పృథ్వీ షా త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగించాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేసిన 4.3 ఓవ‌ర్‌లో పృథ్వీ షా(13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 38 ప‌రుగుల వ‌ద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. 5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ స్కోరు 44/1. వార్న‌ర్‌(29), మిచెల్ మార్ష్ (1) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 10:50 PM (IST)

    ధాటిగా ఆడుతున్న వార్న‌ర్‌

    స్వ‌ల్ప లక్ష్యాన్ని ఛేధించేందుకు బ‌రిలోకి దిగింది ఢిల్లీ జట్టు. ఓపెన‌ర్, కెప్టెన్ వార్న‌ర్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కుల్వంత్ ఖేజ్రోలియా వేసిన రెండో ఓవ‌ర్‌లో మూడు ఫోర్లు కొట్టారు. 2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ స్కోరు 19/0. వార్న‌ర్‌(13), పృథ్వీ షా(6) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 10:27 PM (IST)

    ఢిల్లీ ల‌క్ష్యం 128

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టుతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 127 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో జేస‌న్ రాయ్‌(43; 39 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఆండ్రీ ర‌స్సెల్‌(38 నాటౌట్‌; 31 బంతుల్లో 1ఫోర్, 4సిక్స‌ర్లు) లు రాణించారు. మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ఇషాంత్ శ‌ర్మ, అన్రిచ్ నోర్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ త‌లా రెండు వికెట్లు తీయ‌గా, ముకేశ్ కుమార్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

  • 20 Apr 2023 09:56 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన కోల్‌క‌తా

    కుల్‌దీప్ యాద‌వ్ వ‌రుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. 14.5 ఓవ‌ర్‌కు అనుకుల్ రాయ్(0)ను ఎల్బీగా ఔట్ చేశాడు.

  • 20 Apr 2023 09:54 PM (IST)

    జేస‌న్ రాయ్ ఔట్‌

    కుల్దీప్ యాద‌వ్ వేసిన 14.4 ఓవ‌ర్‌కు జేస‌న్ రాయ్(43) అమన్ హకీమ్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ చేరుకున్నారు.

  • 20 Apr 2023 09:34 PM (IST)

    ఆరు వికెట్లు కోల్పోయిన కోల్‌క‌తా

    అక్ష‌ర్ ప‌టేల్ వేసిన 10.2 ఓవ‌ర్‌కు లిత్ యాద‌వ్‌కు క్యాచ్ ఇచ్చి రింకు సింగ్ ఔట్ కాగా, ఇషాంత్ శ‌ర్మ వేసిన 11.2 ఓవ‌ర్‌కు డేవిడ్ వార్న‌ర్‌(4)కు క్యాచ్ ఇచ్చి సునీల్ న‌రైన్ (4) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో కోల్‌క‌తా ఆరు వికెట్లు కోల్పోయింది. 12 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 72/6. జేస‌న్ రాయ్‌(35), ఆండ్రూ ర‌సెల్‌(1) క్రీజులో ఉన్నాడు.

  • 20 Apr 2023 09:21 PM (IST)

    మ‌న్‌దీప్ సింగ్ ఔట్‌

    కోల్‌క‌తా నాలుగో వికెట్ కోల్పోయింది. మ‌న్‌దీప్ సింగ్‌(12) ఔటైయ్యాడు. అక్ష‌ర్ ప‌టేల్ వేసిన 8.2 ఓవ‌ర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 9 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 54/4. జేస‌న్ రాయ్‌(26), రింకూ సింగ్‌(4) క్రీజులో ఉన్నాడు.

  • 20 Apr 2023 09:05 PM (IST)

    నితీశ్ రాణా ఔట్‌

    కోల్‌క‌తాకు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు కెప్టెన్ నితీశ్ రాణా(4) ఔట్ అయ్యాడు. ఇషాంత్ శ‌ర్మ వేసిన 5.2 ఓవ‌ర్‌కు ముకేష్‌కుమార్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 32 ప‌రుగుల వ‌ద్ద కోల్‌క‌తా మూడో వికెట్ కోల్పోయింది. 6 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 35/3. జేస‌న్ రాయ్‌(22), మ‌న్‌దీప్ సింగ్‌(2) క్రీజులో ఉన్నాడు.

  • 20 Apr 2023 08:53 PM (IST)

    వెంక‌టేశ్ అయ్య‌ర్ ఔట్

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో వెంక‌టేశ్‌ అయ్య‌ర్‌(0) షాట్ ఆడ‌గా మిచెల్ మార్ష్ క్యాచ్ అందుకోవ‌డంతో 25 ప‌రుగుల వ‌ద్ద కోల్‌క‌తా రెండో వికెట్ కోల్పోయింది. 4 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 29/2. జేస‌న్ రాయ్‌(10), నితీశ్ రాణా(0) క్రీజులో ఉన్నారు.

  • 20 Apr 2023 08:46 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన కోల్‌క‌తా

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌క‌తా తొలి వికెట్‌ను కోల్పోయింది. ముకేశ్‌కుమార్ బౌలింగ్ లిట‌న్ దాస్‌(4) ల‌లిత్ యాద‌వ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 15 ప‌రుగుల వ‌ద్ద కోల్‌క‌తా మొద‌టి వికెట్ కోల్పోయింది. 2 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 15/1. జేస‌న్ రాయ్‌(10), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(0) క్రీజులో ఉన్నారు.