IPL 2023, GT Vs RR: గుజ‌రాత్ టైటాన్స్ పై రాజ‌స్థాన్ విజ‌యం

IPL 2023, GT Vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.

IPL 2023, GT Vs RR: గుజ‌రాత్ టైటాన్స్ పై రాజ‌స్థాన్ విజ‌యం

GT Vs RR

IPL 2023, GT Vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జ‌రిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజ‌రాత్ టైటాన్స్ నిర్దేశించిన 178 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19.2 ఓవ‌ర్ల‌లో ఛేదించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 16 Apr 2023 11:10 PM (IST)

    రాజ‌స్థాన్ విజ‌యం

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జ‌రిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజ‌రాత్ టైటాన్స్ నిర్దేశించిన 178 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19.2 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో సంజు శాంస‌న్‌(60; 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) హెట్ మ‌య‌ర్‌(56 నాటౌట్; 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) దంచికొట్ట‌గా ప‌డిక్క‌ల్‌(26) ప‌ర్వాలేద‌నిపించాడు. ఆఖ‌ర్లో అశ్విన్‌(10; 3 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) త‌న వంతు స‌హ‌కారాన్ని అందించ‌డంతో రాజ‌స్థాన్ విజ‌యం సాధించింది.

    అంత‌క‌ముందు టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లలో ఏడు వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో డేవిడ్ మిల్ల‌ర్‌(46), శుభ్‌మ‌న్ గిల్‌(45), హార్ధిక్ పాండ్యా(28), అభిషేక్ మ‌నోహ‌ర్‌(27) లు రాణించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయ‌గా ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, చాహ‌ల్ లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 16 Apr 2023 10:52 PM (IST)

    హెట్‌మ‌య‌ర్‌ దూకుడు

    హెట్‌మ‌య‌ర్ దూకుడు పెంచాడు. అల్జారీ జోసెఫ్ వేసిన ఓవ‌ర్‌లో రెండు సిక్స్‌లు కొట్టాడు. ధృవ్ జురెల్ ఓఫోర్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 20 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 134/5. హిట్‌మ‌య‌ర్‌(35), ధృవ్ జురెల్(5) క్రీజులో ఉన్నారు

  • 16 Apr 2023 10:44 PM (IST)

    శాంస‌న్ అర్ధ‌శ‌త‌కం.. ఆ వెంట‌నే ఔట్‌

    నూర్ అహ్మద్ వేసిన 15వ ఓవ‌ర్ రెండో బంతికి సింగిల్ తీసి శాంస‌న్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో అర్థ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. నాలుగో బంతికి సిక్స్‌, ఐదో బంతికి ఫోర్ కొట్టాడు. అదే ఊపులో మ‌రో భారీ షాట్‌కు య‌త్నించిన శాంస‌న్(60) ఔట్ అయ్యాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 13 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 114/5. హిట్‌మ‌య‌ర్‌(20) క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 10:38 PM (IST)

    వేగం పెంచిన హెట్‌మ‌య‌ర్‌

    అల్జారీ జోసెఫ్ వేసిన ఓవ‌ర్‌లో హెట్ మ‌య‌ర్ ఓ సిక్స్‌, ఓ ఫోర్ కొట్ట‌డంతో మొత్తం 15 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 101/4. హిట్‌మ‌య‌ర్‌(18) సంజు శాంస‌న్‌(49) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 10:33 PM (IST)

    శాంస‌న్ దూకుడు

    శాంస‌న్ దూకుడు పెంచాడు. ర‌షీద్ ఖాన్ వేసిన ఓవ‌ర్‌లో హ్యాట్రిక్ సిక్స‌ర్లు కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 20 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 86/4. హిట్‌మ‌య‌ర్‌(4) సంజు శాంస‌న్‌(48) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 10:23 PM (IST)

    రియాన్ ప‌రాగ్ ఔట్‌

    ర‌షీన్ త‌న మాయాజాలాన్ని చూపిస్తున్నాడు. వ‌రుస‌గా రెండో ఓవ‌ర్‌లోనూ వికెట్ ప‌డ‌గొట్టాడు.ర‌న్‌రేట్ పెరిగిపోతుండ‌డంతో భారీ షాట్లు కొట్టే ప్ర‌య‌త్నంలో రియాన్ ప‌రాగ్ (5) బౌండ‌రీ లైన్ వ‌ద్ద మిల్ల‌ర్‌కు చిక్కాడు. ఆఖ‌రి బంతికి శాంస‌న్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 62/4. హిట్‌మ‌య‌ర్‌(1) సంజు శాంస‌న్‌(27) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 10:13 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన రాజ‌స్థాన్‌

    క్రీజులో కుదురుకున్న ప‌డిక్క‌ల్ ను ర‌షీద్ ఖాన్ ఔట్ చేశాడు. ఈ ఓవ‌ర్‌లో నాలుగు ప‌రుగులు వ‌చ్చాయి. 9 వ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 50/3. రియాన్ ప‌రాగ్‌(2) సంజు శాంస‌న్‌(19) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 10:11 PM (IST)

    నిల‌క‌డ‌గా ఆడుతున్న శాంస‌న్‌, ప‌డిక్క‌ల్‌

    నాలుగు ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయిన రాజ‌స్థాన్‌ను కెప్టెన్ సంజు శాంస‌న్‌, ప‌డిక్క‌ల్‌లు ఆదుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా వేసిన ఎనిమిద ఓవ‌ర్‌లోని ఐదో బంతికి శాంస‌న్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 46/2. దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (26), సంజు శాంస‌న్‌(17) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 09:56 PM (IST)

    ప‌డిక్క‌ల్ సిక్స్‌

    రాజ‌స్థాన్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. హార్దిక్ పాండ్య వేసిన ఆరో ఓవ‌ర్‌లోని నాలుగో బంతికి ప‌డిక్క‌ల్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 6 ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 26/2. దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (19), సంజు శాంస‌న్‌(4) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 09:42 PM (IST)

    బ‌ట్ల‌ర్ ఔట్‌

    రాజ‌స్థాన్ జ‌ట్టుకు మ‌రో షాక్ త‌గింది. ఫామ్‌లో ఉన్న జోస్ బ‌ట్ల‌ర్‌(0) డ‌కౌట్ అయ్యాడు. ష‌మీ వేసిన మూడో ఓవ‌ర్‌లోని ఐదో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఓవ‌ర్‌లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే వ‌చ్చింది. 3 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 4/2. దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (1), సంజు శాంస‌న్‌(0) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 09:35 PM (IST)

    జైశ్వాల్ ఔట్

    రాజ‌స్థాన్ ల‌క్ష్యం 178 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. తొలి ఓవ‌ర్‌లో రెండు ప‌రుగులు మాత్ర‌మే రాగా.. రెండో ఓవ‌ర్ మూడో బంతికి జైశ్వాల్‌ను హార్దిక్ ఔట్ చేశాడు. ఈ ఓవ‌ర్‌లో 1 ప‌రుగు మాత్ర‌మే వ‌చ్చింది. 2 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 3/1. దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (1), జోస్ బ‌ట్ల‌ర్‌(0) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 09:12 PM (IST)

    రాజ‌స్థాన్ ల‌క్ష్యం 178

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జ‌ట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లలో ఏడు వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో డేవిడ్ మిల్ల‌ర్‌(46), శుభ్‌మ‌న్ గిల్‌(45), హార్ధిక్ పాండ్యా(28), అభిషేక్ మ‌నోహ‌ర్‌(27) లు రాణించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయ‌గా ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, చాహ‌ల్ లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 16 Apr 2023 08:44 PM (IST)

    శుభ్‌మ‌న్ గిల్ ఔట్‌

    అర్ధ‌శ‌త‌కం దిశ‌గా సాగుతున్న గిల్‌(45)ను సందీప్ శ‌ర్మ బోల్తా కొట్టించాడు. బ‌ట్ల‌ర్ క్యాచ్ అందుకోవ‌డంతో అర్ధ‌శ‌త‌కానికి 5 ప‌రుగుల దూరంలో గిల్ ఔట్ అయ్యాడు. 15.2 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 121/4. డేవిడ్ మిల్ల‌ర్‌(20) క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 08:40 PM (IST)

    మిల్ల‌ర్ సిక్స్‌

    మిల్ల‌ర్ క్ర‌మంగా దూకుడు పెంచుతున్నాడు. చ‌హ‌ల్ బౌలింగ్ ఓ సిక్స్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 119/3. డేవిడ్ మిల్ల‌ర్‌(20), శుభ్‌మ‌న్ గిల్ (43) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 08:33 PM (IST)

    2 ప‌రుగులు

    ఆడ‌మ్ జంపా వేసిన 13 ఓవ‌ర్‌లో 2 ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌లేదు. 13 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 102/3. డేవిడ్ మిల్ల‌ర్‌(7), శుభ్‌మ‌న్ గిల్ (40) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 08:23 PM (IST)

    హార్దిక్ పాండ్యా ఔట్‌

    గుజ‌రాత్ జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న పాండ్యాకు చ‌హ‌ల్ బ్రేకులు వేశాడు. షాట్‌కు యత్నించిన పాండ్యా( 28) జైశ్వాల్ చేతికి చిక్కాడు. 11 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 94/3. డేవిడ్ మిల్ల‌ర్‌(2), శుభ్‌మ‌న్ గిల్ (37) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 08:11 PM (IST)

    17 ప‌రుగులు

    గుజ‌రాత్ బ్యాట‌ర్లు గిల్‌, హార్దిక్ పాండ్యాలు దూకుడు పెంచాడు. అశ్విన్ వేసిన 8 ఓవ‌ర్‌లో గిల్ ఓ ఫోర్‌, ఓ సిక్స్ కొట్ట‌గా, హార్దిక్ ఓ ఫోర్ బాద‌డంతో మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 72/2. హార్దిక్ పాండ్య‌(19), శుభ్‌మ‌న్ గిల్ (27) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 08:04 PM (IST)

    హార్దిక్ పాండ్యా దూకుడు

    వ‌చ్చి రావ‌డంతో కెప్టెన్ హార్దిక్ పాండ్య దూకుడుగా ఆడుతున్నాడు. ఆడ‌మ్ జంపా వేసిన ఏడో ఓవ‌ర్‌లో ఓ సిక్స్‌, ఫోర్ కొట్టారు. ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 55/2. హార్దిక్ పాండ్య‌(13), శుభ్‌మ‌న్ గిల్ (16) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 08:02 PM (IST)

    సాయి సుద‌ర్శ‌న్ ర‌నౌట్‌

    గుజ‌రాత్ జ‌ట్టు రెండో వికెట్ కోల్పోయింది. సాయి సుద‌ర్శ‌న్ ర‌నౌట్ అయ్యాడు. ఆడ‌మ్ జంపా వేసినఈ ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 32/2. హార్దిక్ పాండ్య‌(0), శుభ్‌మ‌న్ గిల్ (6) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 07:49 PM (IST)

    సాహా ఔట్‌

    టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. ట్రెంట్ బౌల్డ్ వేసిన మొద‌టి ఓవ‌ర్ మూడో బంతికి సాహా ఔట్ అయ్యాడు. వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ దూకుడుగా ఆడుతున్నాడు. 3 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 24/1. సాయి సుద‌ర్శ‌న్ (14), శుభ్‌మ‌న్ గిల్ (4) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 07:13 PM (IST)

    సంజూ శాంసన్ సేన

    రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవి చంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, చాహెల్

  • 16 Apr 2023 07:10 PM (IST)

    హార్దిక్ పాండ్యా సేన

    గుజరాత్ టైటాన్స్ తుది జట్టు: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ

  • 16 Apr 2023 07:02 PM (IST)

    రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్

    టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. హోల్డర్ స్థానంలో బౌల్ట్ ని తీసుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్  కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు.