IPL 2023: స‌న్‌రైజ‌ర్స్ పై గుజ‌రాత్ ఘ‌న విజ‌యం

ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఘ‌న విజ‌యం సాధించింది.

IPL 2023: స‌న్‌రైజ‌ర్స్ పై గుజ‌రాత్ ఘ‌న విజ‌యం

GT vs SRH

GT vs SRH: ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో స‌న్ రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 15 May 2023 11:24 PM (IST)

    గుజ‌రాత్ విజ‌యం

    ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో స‌న్ రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. దీంతో గుజ‌రాత్ 34 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో కాస్లెన్ (64 ) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు.

  • 15 May 2023 10:55 PM (IST)

    క్లాసెన్ అర్ధ‌శ‌త‌కం

    ఓ వైపు వికెట్లు కోల్పోతున్న‌ప్ప‌టికి హెన్రిచ్ క్లాసెన్ మ‌రో ఎండ్‌లో నిల‌బ‌డ్డాడు. ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 35 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. 14 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 104/7. క్లాసెన్‌(50), భువ‌నేశ్వ‌ర్ కుమార్(16) లు క్రీజులో ఉన్నారు.

  • 15 May 2023 10:29 PM (IST)

    దెబ్బ‌కొట్టిన మోహిత్ శ‌ర్మ‌

    స‌న్ రైజ‌ర్స్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. మోహిత్ శ‌ర్మ త‌న వ‌రుస ఓవ‌ర్ల‌లో సన్వీర్ సింగ్(7), అబ్దుల్ స‌మ‌ద్‌(4), మార్కో జాన్సెన్(3)ల‌ను ఔట్ చేశాడు. దీంతో 59 ప‌రుగుల‌కే స‌న్‌రైజ‌ర్స్ ఏడు వికెట్లు కోల్పోయింది. 9 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 59/7. క్లాసెన్‌(23), భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌(0) క్రీజులో ఉన్నారు.

  • 15 May 2023 10:01 PM (IST)

    మార్‌క్ర‌మ్ ఔట్

    స‌న్‌రైజ‌ర్స్ మ‌రో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ మార్‌క్ర‌మ్ (10) ఔట్ అయ్యాడు. మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో శంక‌ర చేతికి చిక్కాడు. దీంతో 29 ప‌రుగుల(4.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 15 May 2023 09:50 PM (IST)

    అభిషేక్‌, రాహుల్ త్రిపాఠి ఔట్

    స‌న్‌రైజ‌ర్స్‌కు వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతున్నాయి. యశ్ దయాల్ బౌలింగ్‌లో(1.4వ ఓవ‌ర్‌) అభిషేక్ శ‌ర్మ‌(4) వికెట్ కీప‌ర్ సాహా చేతికి చిక్కగా.. మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో(2.1వ ఓవ‌ర్‌) రాహుల్ త్రిపాఠి(1) తెవాటియాకు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 12 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది హైద‌రాబాద్‌.

  • 15 May 2023 09:45 PM (IST)

    అన్మోల్‌ప్రీత్ సింగ్ ఔట్‌

    ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన హైద‌రాబాద్‌కు మొద‌టి ఓవ‌ర్‌లోనే షాక్ త‌గిలింది. మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో ర‌షీద్ ఖాన్ క్యాచ్ అందుకోవ‌డంతో అన్మోల్‌ప్రీత్ సింగ్(5) ఔట్ అయ్యాడు. దీంతో ఆరు ప‌రుగుల(0.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద హైద‌రాబాద్ మొద‌టి వికెట్ కోల్పోయింది.

  • 15 May 2023 09:23 PM (IST)

    స‌న్‌రైజ‌ర్స్ ల‌క్ష్యం 189

    ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్(101) సెంచ‌రీ చేయ‌డంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. 56 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో ఐపీఎల్‌తో త‌న తొలి శ‌త‌కాన్ని గిల్ అందుకున్నాడు. సాయి సుద‌ర్శ‌న్‌(47; 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. హార్ధిక్ పాండ్యా(8), డేవిడ్ మిల్ల‌ర్‌(7), రాహుల్ తెవాటియా(3), వృద్దిమాన్ సాహా(0) లు విఫ‌లం అయ్యారు. స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఐదు వికెట్లు తీయ‌గా, మార్కో జాన్సెన్, ఫరూఖీ, న‌ట‌రాజ‌న్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 15 May 2023 09:09 PM (IST)

    శుభ్‌మ‌న్ గిల్ శ‌త‌కం

    గుజ‌రాత్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ చేశాడు. న‌ట‌రాజ‌న్ బౌలింగ్‌లో(18.2వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 56 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో శ‌త‌కాన్ని పూర్తి చేశాడు.

  • 15 May 2023 09:00 PM (IST)

    మిల్ల‌ర్ ఔట్‌

    గుజ‌రాత్ మ‌రో వికెట్ కోల్పోయింది. న‌ట‌రాజ‌న్ బౌలింగ్‌లో డేవిడ్ మిల్ల‌ర్‌(7) మార్‌క్ర‌మ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 169 ప‌రుగుల(16.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద గుజ‌రాత్ నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 15 May 2023 08:53 PM (IST)

    హార్ధిక్ పాండ్యా ఔట్‌

    గుజ‌రాత్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు కోల్పోయింది. భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యా(8) రాహుల్ త్రిపాఠి చేతికి చిక్కాడు. దీంతో 156 ప‌రుగుల(15.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద గుజ‌రాత్ మూడో వికెట్ కోల్పోయింది.

  • 15 May 2023 08:50 PM (IST)

    సాయి సుద‌ర్శ‌న్ ఔట్‌

    గుజ‌రాత్ మ‌రో వికెట్ కోల్పోయింది. సాయి సుద‌ర్శ‌న్(47) ఔట్ అయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడ‌గా న‌ట‌రాజ‌న్ చేతికి చిక్కాడు. దీంతో 147 ప‌రుగుల(14.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద గుజ‌రాత్ రెండో వికెట్ కోల్పోయింది. 15 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 154/2. హార్దిక్ పాండ్యా (6), శుభ్‌మ‌న్ గిల్‌(90)లు క్రీజులో ఉన్నారు.

  • 15 May 2023 08:14 PM (IST)

    శుభ్‌మ‌న్ గిల్ హాఫ్ సెంచ‌రీ

    శుభ్‌మ‌న్ గిల్ దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్ర‌మంలో 22 బంతుల్లోనే అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవ‌ర్ ను మ‌యాంక్ మార్కండే వేయ‌గా మొద‌టి బంతికి ఫోర్ కొట్టి హాఫ్ సెంచ‌రీ అందుకున్నాడు. 8 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 89/1. గిల్ 26 బంతుల్లో 58, సాయి సుద‌ర్శ‌న్ 20 బంతుల్లో 23 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 15 May 2023 08:03 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    గుజ‌రాత్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. మూడో బంతికే వికెట్ కోల్పోయినప్ప‌టికి ఆ ప్ర‌భావం ఏ మాత్రం క‌నిపించ‌కుండా శుభ్‌మ‌న్ గిల్‌, సాయి సుద‌ర్శ‌న్‌లు ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. 6 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 65/1. గిల్ 16 బంతుల్లో 36, సాయి సుద‌ర్శ‌న్ 18 బంతుల్లో 21 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 15 May 2023 07:36 PM (IST)

    వృద్ధిమాన్ సాహా డ‌కౌట్

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్‌కు భారీ షాక్ త‌గిలింది. మూడో బంతికే వృద్ధిమాన్ సాహా డ‌కౌట్ అయ్యాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో అభిషేక్ శ‌ర్మ‌కు క్యాచ్ ఇచ్చాడు. 1 ఓవ‌ర్‌కు గుజ‌రాత్ స్కోరు 5/1. శుభ్‌మ‌న్ గిల్‌(3), సాయి సుద‌ర్శ‌న్‌(2) క్రీజులో ఉన్నారు.

  • 15 May 2023 07:14 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జ‌ట్టు

    అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్‌), అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూఖీ, టి నటరాజన్

  • 15 May 2023 07:14 PM (IST)

    గుజరాత్ టైటాన్స్ తుది జ‌ట్టు

    శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీప‌ర్‌), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, దసున్ షనక, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్

  • 15 May 2023 07:05 PM (IST)

    టాస్ గెలిచిన స‌న్‌రైజ‌ర్స్‌

    టాస్ గెలిచిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్‌క్ర‌మ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజ‌రాత్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.