IPL, LSG Vs RCB: లక్నోపై బెంగళూరు ఘన విజయం..

IPL, LSG Vs RCB: పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంటే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.

IPL, LSG Vs RCB: లక్నోపై బెంగళూరు ఘన విజయం..

IPL 2023, LSG Vs RCB

IPL, LSG Vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా 43వ మ్యాచ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఏకానా క్రికెట్ స్టేడియంలో జరిగింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడ్డాయి.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. 127 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో.. 19.5 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 18 రన్స్ తేడాతో పరాజయం పాలైంది.

పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంటే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఏప్రిల్ 10న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ పోరులో బెంగళూరుపై లక్నో ఒక వికెట్ తేడాతో గెలుపొందింది.

 

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 01 May 2023 11:40 PM (IST)

    బెంగళూరు ప్రతీకారం .. లక్నో చిత్తు

    బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో లక్నో ఓటమి పాలైంది. 18 పరుగుల తేడాతో ఆర్సీబీ విక్టరీ కొట్టింది. 127 పరుగుల స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో.. 19.5ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

  • 01 May 2023 11:28 PM (IST)

    18ఓవర్లకు 96/8

    18 ఓవర్లకు లక్నో జట్టు 8 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.

  • 01 May 2023 11:14 PM (IST)

    8వ వికెట్ డౌన్..బిష్ణోయ్ రనౌట్

    లక్నో జట్టు 8వ వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 77 పరుగుల వద్ద రవి బిష్ణోయ్(5) రనౌట్ అయ్యాడు. 15 ఓవర్లకు లక్నో స్కోర్ 78/8.

  • 01 May 2023 10:58 PM (IST)

    7వ వికెట్ డౌన్.. గౌతమ్ రనౌట్

    లక్నో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుసగా వికెట్లు పడుతున్నాయి. 66 పరుగుల జట్టు స్కోర్ వద్దు లక్నో 7వ వికెట్ కోల్పోయింది. క్రిష్ణప్ప గౌతమ్(13 బంతుల్లో 23 పరుగులు) రనౌట్ అయ్యాడు.

  • 01 May 2023 10:35 PM (IST)

    లక్నోకు మరో షాక్..

    127 పరుగుల స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుసగా వికెట్లు పడుతున్నాయి. 38 పరుగుల జట్టు స్కోర్ వద్ద లక్నో 5వ వికెట్ కోల్పోయింది. నికోలస్ పూరన్(9) ను కర్ణ్ శర్మ ఔట్ చేశాడు. 7 ఓవర్లకు లక్నో స్కోర్ 38/5.

  • 01 May 2023 10:30 PM (IST)

    6 ఓవర్లకు లక్నో స్కోర్..

    6 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో జట్టు 4 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది.

  • 01 May 2023 10:26 PM (IST)

    4వ వికెట్ కూడా పాయె

    లక్నో సూపర్ జెయింట్స్ పీకల్లోతే కష్టాల్లో పడింది. వరుసగా వికెట్లు పడుతున్నాయి. 27 పరుగుల జట్టు స్కోర్ వద్ద లక్నో జట్టు 4వ వికెట్ కోల్పోయింది. దీపక్ హుడా(1) ను డిసిల్వ ఔట్ చేశాడు.

  • 01 May 2023 10:23 PM (IST)

    లక్కో స్కోర్.. 5 ఓవర్లకు 27/3

    లక్కో జట్టు 5 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది.

  • 01 May 2023 10:19 PM (IST)

    మూడో వికెట్ కూడా డౌన్

    లక్నో సూపర్ జెయింట్స్ కష్టాల్లో పడింది. వరుసగా వికెట్లు పడుతున్నాయి. 21 పరుగుల జట్టు స్కోర్ వద్ద లక్నో జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఆయుష్ బదోనీని హేజిల్ వుడ్ ఔట్ చేశాడు. బదోనీ 11 బంతుల్లో 4 పరుగులే చేశాడు.

  • 01 May 2023 10:16 PM (IST)

    రెండో వికెట్ డౌన్, పాండ్యా ఔట్

    127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 19 పరుగుల జట్టు స్కోర్ వద్ద కృనాల్ పాండ్యా.. మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. పాండ్యా 11 బంతుల్లో 14 రన్స్ చేశాడు.

  • 01 May 2023 10:13 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన లక్నో, మయర్స్ డకౌట్

    127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్ లో కైల్ మయర్స్ డకౌట్ అయ్యాడు.

  • 01 May 2023 09:42 PM (IST)

    లక్నో సూపర్ జెయింట్స్ టార్గెట్ 127

    లక్నో సూపర్ జెయింట్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 127 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ జట్టులో కోహ్లీ 31, డు ప్లెసిస్ 44, అనుజ్ 9, మ్యాక్స్ వెల్ 4, సుయాష్ 6, దినేశ్ కార్తీక్ 16, మహిపాల్ 3, హసరంగా 8 (నాటౌట్), కర్ణ్ శర్మ 2, సిరాజ్ 0, జోష్ 1  పరుగు చేశారు. దీంతో 20 ఓవర్లలో బెంగళూరు 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.

  • 01 May 2023 09:39 PM (IST)

    9 వికెట్లు డౌన్

    ఆర్సీబీ 9 వికెట్లు కోల్పోయింది. దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, సిరాజ్ వెను వెంటనే ఔట్ అయ్యారు.

  • 01 May 2023 09:28 PM (IST)

    ఆరో వికెట్ డౌన్

    ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. మహిపాల్ 3 పరుగులకే ఔటయ్యాడు. ఆర్సీబీ స్కోరు 115/6 (18 ఓవర్లకు)గా ఉంది. 

  • 01 May 2023 09:23 PM (IST)

    5 వికెట్లు డౌన్

    వాన వెలియడంతో ఆటను కొనసాగిస్తున్నారు. డు ప్లెసిస్ 44 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్ లో ఔటయ్యాడు. స్కోరు 17 ఓవర్లకు 110/5 గా ఉంది.

  • 01 May 2023 08:56 PM (IST)

    వరుణుడి అడ్డంకి

    ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. అమిత్ మిశ్రా బౌలింగ్ లో సుయాష్ ఔట్ అయ్యారు. డుప్లెసిస్ 40, దినేశ్ కార్తీక్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. 15.2 ఓవర్ల వద్ద ఆర్సీబీ స్కోరు 93/4 గా ఉంది. ఆ సమయంలో వర్షం పడడంతో ఆట నిలిచింది.

  • 01 May 2023 08:35 PM (IST)

    ఆర్సీబీ స్కోరు 82/3

    ఆర్సీబీ స్కోరు 13 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 82గా ఉంది. క్రీజులో డు ప్లెసిస్ 35, సుయాష్ ప్రభుదేసాయి 1 పరుగుతో ఉన్నారు.

  • 01 May 2023 08:30 PM (IST)

    అనుజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్ వెల్ ఔట్

    అనుజ్ రావత్ 9 పరుగులు చేసి కృష్ణప్ప బౌలింగ్ లో ఔటయ్యాడు. అనంతరం గ్లెన్ మ్యాక్స్ వెల్ క్రీజులోకి వచ్చి 4 పరుగులకే రవి బిష్ణోయి బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

  • 01 May 2023 08:14 PM (IST)

    కోహ్లీ ఔట్

    విరాట్ కోహ్లీ 31 పరుగులు చేసి రవి బిష్ణోయి బౌలింగ్ లో ఔటయ్యాడు. క్రీజులోకి అనుజ్ రావత్ వచ్చాడు. అతడితో పాటు క్రీజులో డు ప్లెసిస్ (31 పరుగులు) ఉన్నాడు.

  • 01 May 2023 07:57 PM (IST)

    6 ఓవర్లకు బెంగళూరు స్కోరు 42

    బెంగళూరు స్కోరు 6 ఓవర్లకు 42 గా ఉంది. విరాట్ కోహ్లీ 21, డు ప్లెసిస్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 01 May 2023 07:33 PM (IST)

    తొలి ఓవర్లో 5 పరుగులు

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. క్రీజులోకి ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ వచ్చారు. తొలి ఓవర్లో 5 పరుగులు చేశారు.

  • 01 May 2023 07:15 PM (IST)

    బెంగళూరు తుది జట్టు

    విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, వనిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, జోష్ హాజిల్‌వుడ్

  • 01 May 2023 07:08 PM (IST)

    లక్నో తుది జట్టు

    కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతం, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్

  • 01 May 2023 07:03 PM (IST)

    టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.