IPL 2023, RCB vs LSG: ఉత్కంఠ పోరులో బెంగళూరుపై లక్నో విజయం

రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

IPL 2023, RCB vs LSG: ఉత్కంఠ పోరులో బెంగళూరుపై లక్నో విజయం

RCB vs LSG

IPL 2023, RCB vs LSG: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ పోరులో బెంగళూరుపై లక్నో విజయం సాధించింది. రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది.

బెంగ‌ళూరు ఓపెనర్లు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(79; 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), విరాట్ కోహ్లి(61; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు)ల‌తో పాటు వ‌న్ డౌన్ బ్యాట‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్(59; 29 బంతుల్లో 3ఫోర్లు, 6 సిక్స‌ర్లు) దంచికొట్ట‌డంతో లక్నో ముందు 213 భారీ ల‌క్ష్యం నిలిచింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్ : స్టాయినిస్ 65, పూరన్ 62, ఆయుష్ 30 పరుగులు చేశారు. బెంగళూరు బౌలింగ్ : సిరాజ్ 3, పర్నెల్ 3, హర్షల్ 2, కర్ణ్ శర్మకు ఒక వికెట్ పడగొట్టారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 10 Apr 2023 11:32 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది. లక్నో ముందు 213 భారీ ల‌క్ష్యం నిలిచింది.

  • 10 Apr 2023 11:26 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది. లక్నో ముందు 213 భారీ ల‌క్ష్యం నిలిచింది.

  • 10 Apr 2023 11:22 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ ఏడో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది. లక్నో ముందు 213 భారీ ల‌క్ష్యం నిలిచింది.

  • 10 Apr 2023 10:37 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ ఐదో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది. లక్నో ముందు 213 భారీ ల‌క్ష్యం నిలిచింది.

  • 10 Apr 2023 10:34 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ నాలుగో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది. లక్నో ముందు 213 భారీ ల‌క్ష్యం నిలిచింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ 99 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది.

  • 10 Apr 2023 10:29 PM (IST)

    ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ 10 ఓవర్లలో 91 పరుగులు

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది. లక్నో ముందు 213 పరుగుల భారీ ల‌క్ష్యం నిలిచింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ మూడు వికెట్ల నష్టానికి 10 ఓవర్లలో 91 పరుగులు చేసింది.

  • 10 Apr 2023 09:59 PM (IST)

    మూడు బంతుల వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు

    ల‌క్నో క‌ష్టాల్లో ప‌డింది. మూడు బంతుల వ్య‌వ‌ధిలో రెండు వికెట్ల‌ను కోల్పోయింది. దీప‌క్ హుడా(9) తో పాటు కృనాల్ పాండ్యా(0)ను వేన్ పార్నెల్ ఒకే ఓవ‌ర్‌లో పెవిలియ‌న్‌కు పంపించాడు. 4 ఓవ‌ర్లకి ల‌క్నో స్కోరు 23/3

  • 10 Apr 2023 09:51 PM (IST)

    క‌ట్టుదిట్టంగా బంతులేస్తున్న ఆర్‌సీబీ బౌల‌ర్లు

    ఆర్‌సీబీ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులు వేస్తుండడంతో ప‌రుగులు చేసేందుకు ల‌క్నో బ్యాట‌ర్లు ఇబ్బంది ప‌డుతున్నారు. మూడు ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో స్కోరు 16/1. కేఎల్ రాహుల్ 7, దీప‌క్ హుడా 4 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 10 Apr 2023 09:44 PM (IST)

    ల‌క్నోకు షాకిచ్చిన సిరాజ్‌

    భారీ ల‌క్ష్యాన్ని చేధించేందుకు బ‌రిలోకి దిగిన ల‌క్నోకు బెంగ‌ళూరు పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ఆదిలోనే గ‌ట్టి షాక్ ఇచ్చాడు. పుల్ ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ కైల్ మేయ‌ర్స్‌ను క‌నీసం ప‌రుగుల ఖాతా తెర‌వ‌క‌ముందే పెవిలియ‌న్‌కు పంపించాడు. తొలి ఓవ‌ర్ మూడో బంతికి మేయ‌ర్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఖ‌రి బంతికి లెగ్ బైస్ రూపంలో నాలుగు ప‌రుగులు వ‌చ్చాయి. మొత్తంగా మొద‌టి ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు వ‌చ్చాయి. దీప‌క్ హుడా(0), కేఎల్ రాహుల్‌(0) ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 10 Apr 2023 09:23 PM (IST)

    ల‌క్నో ముందు భారీ ల‌క్ష్యం

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగులు చేసింది. చివ‌రి నాలుగు ఓవ‌ర్ల‌లో మాక్స్‌వెల్‌, డుప్లెసిస్ లు బౌండ‌రీల‌ వ‌ర్షం కురిపించారు. నువ్వు ఫోర్ కొడితే నేను సిక్స్ కొడ‌తా అన్న‌ట్లుగా సాగింది వీరి బ్యాటింగ్‌. ఈ ఇద్ద‌రి ధాటికి ఆఖ‌రి నాలుగు ఓవ‌ర్ల‌లో 66 ప‌రుగులు వచ్చాయి. ఫాఫ్ డుప్లెసిస్(79; 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), విరాట్ కోహ్లి(61; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు)ల‌తో పాటు గ్లెన్ మాక్స్‌వెల్(59; 29 బంతుల్లో 3ఫోర్లు, 6 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కాలు బాదారు.

  • 10 Apr 2023 08:49 PM (IST)

    డుప్లెసిస్ అర్థ‌శ‌త‌కం

    బెంగ‌ళూరు కెప్టెన్ డుప్లెసిస్ హాఫ్ సెంచ‌రీ చేశాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో రెండో బంతికి సిక్స్ కొట్టి 35 బంతుల్లో ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు స్కోరు 146/1. డుప్లెసిస్ 55, గ్లెన్ మాక్స్‌వెల్ 21 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 10 Apr 2023 08:42 PM (IST)

    వేగం పెంచిన మాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌

    విరాట్ కోహ్లి ఔట్ కావ‌డంతో ప‌రుగుల‌ వేగం నెమ్మ‌దించింది. అయితే.. ర‌వి బిష్ణోయ్ వేసిన‌ ఓవ‌ర్‌లో రెండు, మూడు బంతుల‌ను డుప్లెసిస్‌, చివ‌రి బంతిని గ్లెన్ మాక్స్‌వెల్ సిక్స్ కొట్టారు. ఈ ఓవ‌ర్‌లో 20 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 137/1. గ్లెన్ మాక్స్‌వెల్ 21, డుప్లెసిస్ 46 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 10 Apr 2023 08:24 PM (IST)

    కోహ్లి ఔట్‌

    బెంగ‌ళూరు జ‌ట్టు తొలి వికెట్ కోల్పోయింది. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లి ఔట్ అయ్యాడు. భారీ షాట్ ఆడే క్ర‌మంలో మార్కస్ స్టోయినిస్ చేతికి చిక్కాడు. దీంతో 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాది 61 ప‌రుగులు చేసిన కోహ్లి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ ఓవ‌ర్‌లో కేవ‌లం 5 ప‌రుగులే వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 99/1. ఫాఫ్ డుప్లెసిస్ 32, గ్లెన్ మాక్స్‌వెల్ 2 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 10 Apr 2023 08:16 PM (IST)

    స‌గం ఓవ‌ర్లు పూర్తి

    ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో స‌గం ఓవ‌ర్లు ముగిశాయి. ప‌దో ఓవ‌ర్‌ను కృనాల్ పాండ్యా వేశాడు. రెండో బంతికి కోహ్లి సిక్స్ బాద‌గా నాలుగో బంతిని డుప్లెసిస్ బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. కోహ్లి 58, డుప్లెసిస్ 25 ప‌రుగుల‌తో ఉన్నారు. 10 ఓవ‌ర్ల‌కు స్కోరు 87/0.

  • 10 Apr 2023 08:10 PM (IST)

    ప‌రుగుల యంత్రం అర్ధ‌శ‌త‌కం

    ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి త‌న ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఓ వైపు ఫాఫ్ డుప్లెసిస్ నిదానంగా ఆడుతుంటే ప‌రుగులు చేసే బాధ్య‌త‌ను కోహ్లి భుజాన వేసుకున్నాడు. బౌల‌ర్‌తో సంబంధం లేకుండా ప్ర‌తి ఓవ‌ర్‌లోనూ దంచికొడుతున్నాడు. ఈ క్ర‌మంలో 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాది అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 9 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 74/0. డుప్లెసిస్ 20 ప‌రుగుల‌తో ఉన్నాడు.

  • 10 Apr 2023 07:56 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే..

    ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఓపెన‌ర్లు విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ వికెట్ ప‌డ‌కుండా స్కోరు బోర్డును ముందుకు తీసుకువెలుతున్నారు. ఫాఫ్ డుప్లెసిస్ నిదానంగా ఆడుతుండ‌గా విరాట్ కోహ్లి మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. కేవ‌లం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లు సాయంతో 42 ప‌రుగులు చేశాడు. 6 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 56/0. ఫాఫ్ డుప్లెసిస్ 12 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

  • 10 Apr 2023 07:41 PM (IST)

    కోహ్లి సిక్స్‌, ఫోర్‌

    ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లి త‌న ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు అవేశ్‌ ఖాన్ వేసిన రెండో ఓవ‌ర్‌లోని మూడో బంతిని సిక్సర్‌గా మ‌ల‌చ‌గా ఆ త‌రువాతి బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు స్కోరు 17/0

  • 10 Apr 2023 07:36 PM (IST)

    మొద‌టి ఓవ‌ర్‌లో 4 ప‌రుగులు మాత్ర‌మే

    తొలి ఓవ‌ర్‌లో కేవ‌లం నాలుగు ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. ల‌క్నో బౌల‌ర్ జయదేవ్ ఉనద్కత్ బ్యాట‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. విరాట్ కోహ్లి 3, ఫాఫ్ డుప్లెసిస్ 1 ప‌రుగుతో ఆడుతున్నారు.

  • 10 Apr 2023 07:30 PM (IST)

    బ‌రిలోకి దిగిన ఆర్‌సీబీ ఓపెన‌ర్లు

    రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెన‌ర్లుగా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లిలు మైదానంలోకి అడుగుపెట్టారు. ల‌క్నో బౌల‌ర్ జయదేవ్ ఉనద్కత్ తొలి ఓవ‌ర్‌ను వేయ‌డానికి సిద్ద‌మైయ్యాడు.

  • 10 Apr 2023 07:12 PM (IST)

    లక్నో సూపర్ జెయింట్స్ జ‌ట్టు

    కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్ కీప‌ర్‌), జయదేవ్ ఉనద్కత్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్

  • 10 Apr 2023 07:10 PM (IST)

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్టు

    విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌), అనుజ్ రావత్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్

  • 10 Apr 2023 07:08 PM (IST)

    టాస్ గెలిచిన ల‌క్నో.. బెంగ‌ళూరు బ్యాటింగ్‌

    టాస్ గెలిచిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మ‌రో ఆలోచ‌న లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. మైదానం గ‌త చ‌రిత్ర ఆధారంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు రాహుల్ తెలిపాడు. తాను ఇక్క‌డే పెరిగాన‌ని, ఈ గ్రౌండ్‌లో చాలా మ్యాచులు ఆడిన‌ట్లు చెప్పాడు. చెన్నైతో మ్యాచ్‌లో 220 ప‌రుగుల లక్ష్యానికి చాలా ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాం. బ‌లంగా తిరిగి వ‌చ్చిన‌ట్లు రాహుల్ తెలిపాడు.