IPL 2023, RCB vs RR: పోరాడి ఓడిన రాజ‌స్థాన్‌.. బెంగ‌ళూరు విజ‌యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది.

IPL 2023, RCB vs RR: పోరాడి ఓడిన రాజ‌స్థాన్‌.. బెంగ‌ళూరు విజ‌యం

RCB vs RR

IPL 2023, RCB vs RR: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డంతో బెంగ‌ళూరు 7 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 23 Apr 2023 07:32 PM (IST)

    బెంగ‌ళూరు విజ‌యం

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డంతో బెంగ‌ళూరు 7 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో దేవదత్ పడిక్కల్ (52; 34 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌) అర్థ‌శ‌త‌కంతో రాణించ‌గా య‌శ‌స్వి జైశ్వాల్‌(47; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఆఖ‌ర్లో ధ్రువ్ జురెల్(34 నాటౌట్‌; 16 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స‌ర్లు) జ‌ట్టును గెలిపించేందుకు విఫ‌ల‌య‌త్నం చేశాడు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ మూడు వికెట్లు తీయ‌గా, డేవిడ్ విల్లీ, మ‌హ్మ‌ద్ సిరాజ్‌లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 23 Apr 2023 07:17 PM (IST)

    హెట్‌మ‌య‌ర్ ఔట్‌

    రాజ‌స్థాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. హెట్‌మ‌య‌ర్ ర‌నౌట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ 155 ప‌రుగుల వ‌ద్ద (17.5వ ఓవ‌ర్‌)ఐదో వికెట్‌ను కోల్పోయింది. 18 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 157/5. అశ్విన్‌(0), ధ్రువ్ జురెల్ (22)క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 07:08 PM (IST)

    ధ్రువ్ జురెల్.. సిక్స్‌, ఫోర్‌

    మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్ సిక్స్‌, ఫోర్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు వ‌చ్చాయి. 17 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 145/4. షిమ్రాన్ హెట్మెయర్(3), ధ్రువ్ జురెల్ (12)క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 07:01 PM (IST)

    శాంస‌న్ ఔట్‌

    హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్ సంజు శాంస‌న్‌(22) షాబాజ్ అహ్మద్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో రాజ‌స్థాన్ 125 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 16 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 129/4. షిమ్రాన్ హెట్మెయర్(2), ధ్రువ్ జురెల్ (2)క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 06:53 PM (IST)

    శాంస‌న్ సిక్స్‌, ఫోర్‌

    సంజు శాంస‌న్ దూకుడుగా ఆడుతున్నాడు. హ‌స‌రంగా బౌలింగ్‌లో ఓ ఫోర్‌, సిక్స్ కొట్ట‌డంతో మొత్తంగా 13 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 121/3. సంజుశాంస‌న్‌(18), షిమ్రాన్ హెట్మెయర్(1) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 06:46 PM (IST)

    జైశ్వాల్ ఔట్‌

    హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి క్యాచ్ అందుకోవ‌డంతో య‌శ‌స్వి జైశ్వాల్‌(47) ఔట్ అయ్యాడు. దీంతో రాజ‌స్థాన్ 108 ప‌రుగుల వ‌ద్ద(13.4వ ఓవ‌ర్‌) మూడో వికెట్ కోల్పోయింది. 14 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 105/3. సంజుశాంస‌న్‌(7), షిమ్రాన్ హెట్మెయర్(0) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 06:40 PM (IST)

    5 ప‌రుగులు

    ప‌ద‌మూడో ఓవ‌ర్‌ను హ‌స‌రంగా వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 105/2. సంజుశాంస‌న్‌(5), జైశ్వాల్‌(47) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 06:35 PM (IST)

    ప‌డిక్క‌ల్ ఔట్‌

    రాజ‌స్థాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో ప‌డిక్క‌ల్(52) కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 99 ప‌రుగుల వ‌ద్ద రాజ‌స్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. 12 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 100/2. సంజుశాంస‌న్‌(1), జైశ్వాల్‌(46) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 06:29 PM (IST)

    ప‌డిక్క‌ల్ అర్ధ‌శ‌త‌కం

    హ‌స‌రంగా బౌలింగ్‌లో సింగిల్ తీసి ప‌డిక్క‌ల్ 30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. 11 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 97/1. ప‌డిక్క‌ల్ (51), జైశ్వాల్‌(45) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 06:26 PM (IST)

    ప‌డిక్క‌ల్ రెండు ఫోర్లు

    ప‌దో ఓవ‌ర్‌ను విజయ్‌కుమార్ వైశాక్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో ప‌డిక్క‌ల్ రెండు ఫోర్లు కొట్టాడంతో 11 పరుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 92/1. ప‌డిక్క‌ల్ (48), జైశ్వాల్‌(43) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 06:18 PM (IST)

    10 ప‌రుగులు

    తొమ్మిదో ఓవ‌ర్‌ను హసరంగా వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతికి ప‌డిక్క‌ల్ ఫోర్ కొట్ట‌డంతో మొత్తం 10 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 81/1. ప‌డిక్క‌ల్ (39), జైశ్వాల్‌(42) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 06:16 PM (IST)

    జైశ్వాల్ సిక్స్‌, ఫోర్‌

    ఎనిమిద ఓవ‌ర్‌ను గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో జైశ్వాల్ ఓ సిక్స్‌, ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 14 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 71/1. ప‌డిక్క‌ల్ (31), జైశ్వాల్‌(40) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 06:13 PM (IST)

    దూకుడు పెంచిన ప‌డిక్క‌ల్‌

    ప‌డిక్క‌ల్ క్ర‌మంగా దూకుడు పెంచుతున్నాడు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ ఏడో ఓవ‌ర్‌ను వేయ‌గా తొలి బంతికి సిక్స్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 10 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 57/1. ప‌డిక్క‌ల్ (29), జైశ్వాల్‌(28) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 06:08 PM (IST)

    నిల‌క‌డ‌గా ఆడుతున్న య‌శ‌స్వి, ప‌డిక్క‌ల్‌

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను గ్లెన్ మ్యాక్స్ వెల్ వేయ‌గా ఈ ఓవ‌ర్‌లో ప‌డిక్క‌ల్ ఫోర్ కొట్ట‌గా, జైశ్వాల్ సిక్స్ బాదాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 11 పరుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 47/1. ప‌డిక్క‌ల్ (21), జైశ్వాల్‌(26) క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 05:30 PM (IST)

    ఆఖ‌రి ఓవ‌ర్‌లో మూడు వికెట్లు.. రాజ‌స్థాన్ ల‌క్ష్యం ఎంతంటే..?

    సందీశ్ శ‌ర్మ ఆఖ‌రి ఓవ‌ర్‌ను వేశాడు. తొలి బంతి వైడ్ వేయ‌గా వానింద్ హ‌స‌రంగా ర‌నౌట్ అయ్యాడు. దినేశ్ కార్తిక్ ఫోర్ కొట్ట‌గా రెండో బంతికి బ‌ట్ల‌ర్ చేతికి చిక్కాడు. మూడో బంతికి విజ‌య్‌కుమార్‌(0) హెట్‌మ‌య‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఐదో బంతికి విల్లీ ఫోర్ కొట్ట‌గా ఆఖ‌రి బంతికి ప‌రుగులు ఏమీ రాలేదు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 9 ప‌రుగులు వ‌చ్చాయి. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో బెంగ‌ళూరు 9 వికెట్లు న‌ష్టపోయి 189 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ ముందు 190 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది.

  • 23 Apr 2023 05:11 PM (IST)

    6 ప‌రుగులు

    జేస‌న్ హోల్డ‌ర్ బౌలింగ్‌లో దినేశ్ కార్తిక్ ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో ఆరు ప‌రుగులు వ‌చ్చాయి. 18 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 170/6. వనిందు హసరంగా(2), దినేశ్ కార్తిక్‌(8)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 05:06 PM (IST)

    ప్రభుదేశాయ్ ర‌నౌట్‌

    ఒకే ఓవ‌ర్‌లో బెంగ‌ళూరు జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. సుయాష్ ప్రభుదేశాయ్ ర‌నౌట్ అయ్యాడు. దీంతో 163 వ‌ద్ద(16.5వ ఓవ‌ర్‌) బెంగ‌ళూరు ఆరో వికెట్‌ను కోల్పోయింది. 17 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 164/6. వనిందు హసరంగా(1), దినేశ్ కార్తిక్‌(3)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 05:04 PM (IST)

    మహిపాల్ లోమ్రోర్ ఔట్‌

    బెంగ‌ళూరు జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. చాహ‌ల్ బౌలింగ్‌లో మహిపాల్ లోమ్రోర్ షాట్‌కు య‌త్నించి ప‌డిక్క‌ల్ చేతికి చిక్కాడు. దీంతో బెంగ‌ళూరు 163 ప‌రుగుల(16.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది.

  • 23 Apr 2023 04:58 PM (IST)

    6 ప‌రుగులు

    డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌లు ఔట్ కావ‌డంతో ప‌రుగుల వేగం నెమ్మ‌దించింది. జేస‌న్ హోల్డర్ వేసిన 16 ఓవ‌ర్‌లో 6 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 162/4.మహిపాల్ లోమ్రోర్(8), దినేశ్ కార్తిక్‌(2)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 04:54 PM (IST)

    మ్యాక్స్‌వెల్ ఔట్‌

    బెంగ‌ళూరు మ‌రో వికెట్ కోల్పోయింది. 15వ ఓవ‌ర్‌ను అశ్విన్ వేశాడు. మూడో బంతికి లోమ్రోర్ ఫోర్ కొట్ట‌గా ఆఖ‌రి బంతికి జేస‌న్ హోల్డ‌ర్ కు క్యాచ్ ఇచ్చి మ్యాక్స్‌వెల్‌(77) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో బెంగ‌ళూరు 156 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 15 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 156/4.మహిపాల్ లోమ్రోర్(5), దినేశ్ కార్తిక్‌(0)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 04:46 PM (IST)

    డుప్లెసిస్ ఔట్‌

    బెంగ‌ళూరు మ‌రో వికెట్ కోల్పోయింది. 14వ‌ ఓవ‌ర్‌ను సందీప్ శ‌ర్మ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతికి డుప్లెసిస్(62) ర‌నౌట్ అయ్యాడు. దీంతో బెంగ‌ళూరు 139 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. 14 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 148/3.మహిపాల్ లోమ్రోర్(0), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌(74)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 04:39 PM (IST)

    7 ప‌రుగులు

    అశ్విన్ వేసిన ప‌ద‌మూడో ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 135/2. ఫాఫ్ డుప్లెసిస్(58), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌(65)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 04:34 PM (IST)

    డుప్లెసిస్ అర్ధ‌శ‌త‌కం

    బౌల్ట్ వేసిన ప‌న్నెండో ఓవ‌ర్‌లోని ఐదో బంతిని బౌండ‌రీకి త‌ర‌లించి డుప్లెసిస్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌ల‌తో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేశాడు. 12 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 128/2. ఫాఫ్ డుప్లెసిస్(55), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌(63)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 04:24 PM (IST)

    సిక్స్‌తో మ్యాక్స్‌వెల్‌ హాఫ్ సెంచ‌రీ

    క్రీజులో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి మ్యాక్స్‌వెల్‌ దూకుడుగానే ఆడుతున్నాడు. ఈ క్ర‌మంలో జేసన్ హోల్డర్ వేసిన 9.4వ బంతికి సిక్స్‌ కొట్టి అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 27 బంతుల్లో 5 పోర్లు, 2 సిక్స‌ర్ల‌తో మ్యాక్స్‌వెల్‌ 50 ప‌రుగుల మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 101/2. ఫాఫ్ డుప్లెసిస్(44), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌(53)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 04:18 PM (IST)

    నెమ్మ‌దించిన ప‌రుగుల వేగం

    గ‌త రెండు ఓవ‌ర్లుగా బెంగ‌ళూరు ప‌రుగుల వేగం నెమ్మ‌దించింది. జేసన్ హోల్డర్ వేసిన ఎనిమిదో ఓవ‌ర్‌లో 6 ప‌రుగులు రాగా చాహ‌ల్ వేసిన తొమ్మిదో ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 85/2. ఫాఫ్ డుప్లెసిస్(35), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌(46)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 04:06 PM (IST)

    10 ప‌రుగులు

    ఏడో ఓవ‌ర్‌ను చాహ‌ల్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని నాలుగో బంతికి మ్యాక్స్‌వెల్‌ సిక్స్ కొట్టాడు. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 72/2. ఫాఫ్ డుప్లెసిస్(30), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌(40)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 03:59 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    బెంగ‌ళూరు ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను ర‌విచంద్ర‌న్ అశ్విన్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో మ్యాక్స్‌వెల్‌ ఓ ఫోర్‌, సిక్స్ కొట్ట‌డంతో మొత్తంగా 12 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 62/2. ఫాఫ్ డుప్లెసిస్(29), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌(31)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 03:55 PM (IST)

    మ్యాక్స్‌వెల్‌ రెండు ఫోర్లు

    బెంగ‌ళూరు బ్యాట‌ర్లు దూకుడుగా ఆడుతున్నారు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఐదో ఓవ‌ర్‌లో మ్యాక్స్‌వెల్‌ రెండు ఫోర్లు బాదాడు. ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 50/2. ఫాఫ్ డుప్లెసిస్(28), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌(20)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 03:51 PM (IST)

    డుప్లెసిస్ రెండు సిక్స్‌లు, ఫోర్

    రెండు వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికీ బెంగ‌ళూరు కెప్టెన్ డుప్లెసిస్ దూకుడు కొన‌సాగిస్తున్నాడు. నాలుగో ఓవ‌ర్‌ను సందీప్ శ‌ర్మ వేయ‌గా ఈ ఓవ‌ర్‌లోని మూడు, నాలుగు బంతుల‌ను సిక్స్‌లుగా మ‌లిచాడు. ఆఖ‌రి బంతికి ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 38/2. ఫాఫ్ డుప్లెసిస్(26), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (10) లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 03:45 PM (IST)

    షాబాజ్ అహ్మద్ ఔట్‌

    బెంగ‌ళూరు జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. మూడో ఓవ‌ర్‌ను ట్రెంట్ బౌల్ట్ వేశాడు. ఈ ఓవ‌ర్ తొలి బంతికి షాబాజ్ అహ్మద్‌(2) జైశ్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో బెంగ‌ళూరు 12 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 3 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 20/2. ఫాఫ్ డుప్లెసిస్(10), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (8)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 03:41 PM (IST)

    డుప్లెసిస్ రెండు ఫోర్లు

    రెండో ఓవ‌ర్‌ను సందీప్ శ‌ర్మ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో డుప్లెసిస్ రెండు ఫోర్లు కొట్ట‌డంతో మొత్తం 10 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 12/1. ఫాఫ్ డుప్లెసిస్(10), షాబాజ్ అహ్మద్(2)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 03:39 PM (IST)

    మొద‌టి ఓవ‌ర్‌లో రెండు ప‌రుగులే

    తొలి ఓవ‌ర్‌ను ట్రెంట్ బౌల్ట్ వేశాడు. తొలి బంతికే కోహ్లి గోల్డెన్ డ‌కౌట్‌  కాగా ఈ ఓవ‌ర్‌లో మొత్తం 2 ప‌రుగులు వ‌చ్చాయి. ఫాఫ్ డుప్లెసిస్(1), షాబాజ్ అహ్మద్(1)లు క్రీజులో ఉన్నారు.

  • 23 Apr 2023 03:34 PM (IST)

    మొద‌టి బంతికే కోహ్లి ఔట్‌

    టాస్ ఓడిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బ్యాటింగ్‌కు దిగింది. విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ లు ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగారు. తొలి ఓవ‌ర్‌ను ట్రెంట్ బౌల్ట్ వేశాడు. తొలి బంతికే కోహ్లి ఎల్బీ డ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్క‌సారిగా సైలెన్స్‌గా మారింది.

  • 23 Apr 2023 03:08 PM (IST)

    రాజస్థాన్ రాయల్స్ తుది జ‌ట్టు

    జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

  • 23 Apr 2023 03:07 PM (IST)

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జ‌ట్టు

    విరాట్ కోహ్లి(కెప్టెన్‌), ఫాఫ్ డుప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(వికెట్ కీప‌ర్‌), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్

  • 23 Apr 2023 03:05 PM (IST)

    టాస్ గెలిచిన రాజ‌స్థాన్

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజు శాంస‌న్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.