IPL 2023: హైద‌రాబాద్‌పై ల‌క్నో విజ‌యం

ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విజ‌యం సాధించింది.

IPL 2023: హైద‌రాబాద్‌పై ల‌క్నో విజ‌యం

SRH vs LSG

SRH vs LSG:ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విజ‌యం సాధించింది. స‌న్‌రైజ‌ర్స్ నిర్దేశించిన 183 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19.2 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 13 May 2023 07:14 PM (IST)

    ల‌క్నో విజ‌యం

    ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విజ‌యం సాధించింది. స‌న్‌రైజ‌ర్స్ నిర్దేశించిన 183 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19.2 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో ప్రేరక్ మన్కడ్ (64 నాటౌట్‌; 45 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు.

  • 13 May 2023 06:55 PM (IST)

    స్టోయినిస్ ఔట్‌

    ల‌క్నో మ‌రో వికెట్ కోల్పోయింది. అభిషేక్ శ‌ర్మ బౌలింగ్‌లో అబ్దుల్ స‌మ‌ద్ క్యాచ్ అందుకోవ‌డంతో స్టోయినిస్(40) ఔట్ అయ్యాడు. దీంతో ల‌క్నో 127 ప‌రుగుల(15.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఈ ఓవ‌ర్‌లో స్టోయినిస్ రెండు, పూర‌న్ మూడు సిక్స్‌లు కొట్టారు. మొత్తంగా 31 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోరు 145/3. ప్రేరక్ మన్కడ్(50), నికోల‌స్ పూర‌న్‌(18) లు క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 06:50 PM (IST)

    ప్రేరక్ మన్కడ్ అర్ధ‌శ‌త‌కం

    భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో(14.4వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 35 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో ప్రేరక్ మన్కడ్ ఐపీఎల్‌లో తొలి అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోరు 114/2. ప్రేరక్ మన్కడ్(50), మార్క‌స్ స్టోయినిస్‌(28) లు క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 06:21 PM (IST)

    రెండు వికెట్లు కోల్పోయిన ల‌క్నో

    ల‌క్ష్య ఛేద‌న‌లో ల‌క్నో రెండు వికెట్లు కోల్పోయింది. క్వింట‌న్ డికాక్(29) మ‌యాంక్ మార్కండే బౌలింగ్‌లో(8.2వ ఓవ‌ర్‌) భారీ సాట్‌కు య‌త్నించి అభిషేక్ శ‌ర్మ చేతికి చిక్కాడు. 9 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోరు 61/2. ప్రేరక్ మన్కడ్(23), మార్కస్ స్టోయినిస్(5) క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 05:18 PM (IST)

    ల‌క్నో ల‌క్ష్యం 183

    టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన స‌న్‌రైజ‌ర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్(47; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అబ్దుల్ స‌మ‌ద్‌(37నాటౌట్‌; 25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు) అన్మోల్‌ప్రీత్ సింగ్(36; 27 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీయ‌గా యుధ్వీర్ సింగ్ చరక్, ఆవేష్ ఖాన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 13 May 2023 05:14 PM (IST)

    క్లాసెన్ ఔట్‌

    ధాటిగా ఆడుతున్న క్లాసెన్(47) అర్ధ‌శ‌త‌కానికి మూడు ప‌రుగుల దూరంలో ఔట్ అయ్యాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ప్రేరక్ మన్కడ్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో 173 ప‌రుగుల వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 19 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోర్ 173/6.

  • 13 May 2023 04:38 PM (IST)

    వ‌రుస బంతుల్లో మార్‌క్ర‌మ్‌, గ్లెన్ ఫిలిప్స్ ఔట్‌

    స‌న్‌రైజ‌ర్స్‌కు కృనాల్ పాండ్యా గ‌ట్టి షాక్ ఇచ్చాడు. 13వ ఓవ‌ర్ వేసిన‌ కృనాల్ వ‌రుస బంతుల్లో మార్‌క్ర‌మ్‌, గ్లెన్ ఫిలిప్స్ ల‌ను ఔట్ చేశాడు. తొలి బంతికి మార్‌క్ర‌మ్(28) స్టంపౌట్ కాగా.. రెండో బంతికి గ్లెన్ ఫిలిప్స్ క్లీన్ బౌల్డ్(0) అయ్యాడు. దీంతో 115 ప‌రుగుల‌కే స‌న్‌రైజ‌ర్స్ 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 13 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోర్ 117/5 హెన్రిచ్ క్లాసెన్(21), అబ్దుల్ స‌మ‌ద్‌(1) క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 04:19 PM (IST)

    అన్మోల్‌ప్రీత్ సింగ్ ఔట్‌

    స‌న్‌రైజ‌ర్స్ మ‌రో వికెట్ కోల్పోయింది. నిల‌క‌డ‌గా ఆడుతున్న ఓపెన‌ర్ అన్మోల్‌ప్రీత్ సింగ్(36; 27 బంతుల్లో 7 ఫోర్లు) ఔట్ అయ్యాడు. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో అత‌డే క్యాచ్ అందుకోవ‌డంతో  82 ప‌రుగుల(8.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద స‌న్ రైజ‌ర్స్ మూడో వికెట్ కోల్పోయింది. 9 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోర్ 86/3. ఐడెన్ మార్‌క్ర‌మ్‌(15),హెన్రిచ్ క్లాసెన్(4) క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 04:05 PM (IST)

    రాహుల్ త్రిపాఠి ఔట్‌

    స‌న్‌రైజ‌ర్స్ మ‌రో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న రాహుల్ త్రిపాఠి(20; 13 బంతుల్లో 4 ఫోర్లు) యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో డికాక్ చేతికి చిక్కాడు. దీంతో 56 ప‌రుగుల(5.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోర్ 56/2 అన్మోల్‌ప్రీత్ సింగ్(25), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(0) క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 03:50 PM (IST)

    అభిషేక్ శ‌ర్మ ఔట్‌

    స‌న్‌రైజ‌ర్స్ వికెట్ కోల్పోయింది. యుధ్వీర్ సింగ్ బౌలింగ్‌లో డికాక్ క్యాచ్ అందుకోవ‌డంతో అభిషేక్ శ‌ర్మ‌(7) ఔట్ అయ్యాడు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ 19 ప‌రుగుల(2.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 3 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 26/1. అన్మోల్‌ప్రీత్ సింగ్(14), రాహుల్ త్రిపాఠి(1)లు క్రీజులో ఉన్నారు.

  • 13 May 2023 03:13 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జ‌ట్టు

    అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్‌), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూఖీ

  • 13 May 2023 03:13 PM (IST)

    లక్నో సూపర్ జెయింట్స్ తుది జ‌ట్టు

    క్వింటన్ డి కాక్(వికెట్ కీప‌ర్‌), కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా(వికెట్ కీప‌ర్‌), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్ చరక్, అవేష్ ఖాన్

  • 13 May 2023 03:07 PM (IST)

    టాస్ గెలిచిన స‌న్‌రైజ‌ర్స్‌

    ఉప్ప‌ల్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ మార్‌క్ర‌మ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.