NBK 107: ఈసారి బాలయ్యతో తలపడేది యాక్షన్ కింగేనా?

హీరోను ఎలివేట్ చేయాలంటే అందులో విలన్ కూడా అంతే బలంగా ఉండాలి. ఢీ అంటే ఢీ అనేలా ఉండేలా పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. తరాలుగా సినిమా కథకు ఇదే ప్రధాన బలం.

NBK 107: ఈసారి బాలయ్యతో తలపడేది యాక్షన్ కింగేనా?

Nbk 107

NBK 107: హీరోను ఎలివేట్ చేయాలంటే అందులో విలన్ కూడా అంతే బలంగా ఉండాలి. ఢీ అంటే ఢీ అనేలా ఉండేలా పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. తరాలుగా సినిమా కథకు ఇదే ప్రధాన బలం. అయితే.. ఈ మధ్య మళ్ళీ ఇలాంటి ఎలివేషన్ కు కొత్త టచ్ ఇచ్చి మన దర్శకుడు సూపర్ డూపర్ హిట్స్ కొడుతున్నారు. అలాంటి వారిలో దర్శకుడు బోయపాటి శీను ముందుంటే మరికొంత మంది దర్శకులు కూడా ఇప్పుడు అదే బాటలో వెళ్తున్నారు. డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలతో సక్సెస్ దర్శకుడు అనిపించుకుని గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు.

RRR: న్యూ ఇయర్ సందడి.. టెలికాస్ట్ కానున్న హిందీ ప్రమోషన్లు!

ఈ సినిమాలో కూడా హీరోకు తగ్గ స్థాయిలో విలన్ పాత్రను రాసుకున్నాడట గోపీచంద్. అందుకు బాలయ్య స్థాయి యాక్షన్ కనిపించే విలన్ కోసం ఇప్పుడు వేట మొదలు పెట్టారట. లెజెండ్ సినిమాలో జగపతి బాబును.. తాజాగా అఖండ సినిమాలో శ్రీకాంత్ గా కనిపించగా ఇప్పుడు యాక్షన్ కింగ్ అర్జున గోపిచంద్ సినిమా కోసం విలన్ గా కనిపించనున్నాడట. అర్జున్ ఇప్పటికే చాలా సినిమాలలో ముఖ్య పాత్రలు చేసినా సాలిడ్ స్ట్రాంగ్ విలన్ పాత్ర పడలేదు. ఈసారి అది ఫుల్ ఫిల్ చేయనున్నాడట గోపిచంద్ మలినేని.

Ruhani Sharma: హానీ… హానీ… రుహానీ..!

అర్జున్ కు తెలుగుతో పాటు తమిళం, కన్నడలో కూడా ఫాలోయింగ్ ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశం కాగా ఇప్పటికే చర్చలు, సంప్రదింపులు పూర్తయ్యాయని తెలుస్తుంది. కాగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి ఆధారంగా కథ రాసుకున్న గోపీచంద్ ఇందులో బాలయ్య మార్క్ యాక్షన్ పుష్కలంగా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కాగా, ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతమందిస్తున్నాడు.