Allu Arjun-Sandeep Vanga : సందీప్ వంగతో బన్నీ సినిమా.. ప్రభాస్ స్పిరిట్, బోయపాటి-బన్నీ సినిమాలు వాయిదా పడ్డట్టేనా?

బన్నీ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. సందీప్ రణవీర్ తో బాలీవుడ్ లో యానిమల్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత వీళ్లకు వేరే కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. బన్నీ పుష్ప 2 తర్వాత బోయపాటి సినిమాలో చెయ్యాలి. సందీప్ వంగ కూడా...........................

Allu Arjun-Sandeep Vanga :  సందీప్ వంగతో బన్నీ సినిమా.. ప్రభాస్ స్పిరిట్, బోయపాటి-బన్నీ సినిమాలు వాయిదా పడ్డట్టేనా?

is prabhas spirit and boyapati bunny movies postponed due to allu arjun sandeep vanga movie

Allu Arjun-Sandeep Vanga :  పుష్ప సినిమాతో దేశమంతటా క్రేజ్ సంపాదించాడు అల్లు అర్జున్. సౌత్ తో పాటు ముఖ్యంగా నార్త్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్ బాక్సాఫిస్ వద్ద కలక్షన్స్ కూడా భారీగానే రాబట్టాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఒక సినిమాని ప్రకటించాడు. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

నేడు ఉదయం అల్లు అర్జున్ సడెన్ గా సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాణంలో సినిమా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీ సిరీస్ ప్రొడక్షన్స్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ మరియు సందీప్ వంగ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కలిసి నిర్మించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ప్రకటించడంతో బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Allu Arjun : అర్జున్ రెడ్డి డైరెక్టర్‌ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా అనౌన్స్.. ఆశ్చర్యంలో అభిమానులు..

అయితే బన్నీ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. సందీప్ రణబీర్ కపూర్ తో బాలీవుడ్ లో యానిమల్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత వీళ్లకు వేరే కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. బన్నీ పుష్ప 2 తర్వాత బోయపాటి సినిమాలో చెయ్యాలి. సందీప్ వంగ కూడా ప్రభాస్ తో స్పిరిట్ సినిమా ప్రకటించారు. మరి ఈ సినిమాలు చేస్తారా లేక వీటిని పక్కన పెట్టి పుష్ప 2 తర్వాత సందీప్ యానిమల్ తర్వాత వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తారా అని కొత్త సందేహాలు వస్తున్నాయి. బన్నీ పుష్ప 2 తర్వాత డైరెక్ట్ గా ఇది చేసినా, బోయపాటి సినిమా వాయిదా పడినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ప్రాబ్లమ్ లేదు. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇదే చేయాలంటారు. కానీ ప్రభాస్ స్పిరిట్ వాయిదా పడితే మాత్రం ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతారు. ఇప్పటికే ఈ కాంబోలో సినిమా అనౌన్స్ చేయడంతో తమ హీరో సినిమా ఎక్కడ వాయిదా పడుతుందో అని ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సందీప్ వంగతో ప్రభాస్ స్పిరిట్, బన్నీ సినిమాలు రెండిటికి ప్రొడ్యూసర్స్ ఒకరే కావడం విశేషం. మరి ఏ ప్రాజెక్టు ముందు మొదలవుతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.