Isha Alya : పాయింట్ బ్లాక్ రేంజ్లో నటిపై కాల్పులు..
జార్ఖండ్‌లో ఇషా అల్యా పేరుతో పాపులారిటీ సంపాదించుకున్న నటి 'రియా కుమారి'. జార్ఖండ్‌లోని పలు రీజినల్ సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ లో నటించిన ఈ భామ బుధవారం దారుణ హత్యకి గురైంది. రియా కుమారి భర్త...

Isha Alya murdered by thugs
Isha Alya : జార్ఖండ్‌లో ఇషా అల్యా పేరుతో పాపులారిటీ సంపాదించుకున్న నటి ‘రియా కుమారి’. జార్ఖండ్‌లోని పలు రీజినల్ సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ లో నటించిన ఈ భామ బుధవారం దారుణ హత్యకి గురైంది. రియా కుమారి భర్త పేరు ప్రకాష్ కుమార్ ఒక నిర్మాత. రీజినల్ మూవీస్ అండ్ ఆల్బమ్ తెరకెక్కిస్తుంటాడు. వీరిద్దరికి రెండున్నరేళ్ల ఒక పాప కూడా ఉంది. కాగా ఈ ముగ్గురు కలిసి కార్లో బుధవారం రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్‌కు పయనమయ్యారు.
Dhanya Balakrishna : డైరెక్టర్ని సీక్రెట్‌గా పెళ్లాడిన ధన్య బాలకృష్ణ..
బుధవారం ఉదయం 6 గంటల సమయంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై బగ్నాన్‌లోని మహిశ్రేఖ దగ్గర విశ్రాంతి కోసం కార్ ఆపడంతో.. ముగ్గురు దుండగులు ప్రకాష్ కుమార్ పై దాడి చేసినట్లు, ఆ దొంగలను ప్రతిఘటించే క్రమంలో రియా కుమారిని పాయింట్ బ్లాక్ రేంజ్లో దుండగులు కాల్చి చంపి అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించాడు భర్త ప్రకాష్. ఆ తరువాత ఆమెను కాపాడుకునేందుకు హాస్పిటల్ కోసం 3 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లినట్లు, అయితే అప్పటికే ఆమె చనిపోయింది అని పోలీసులకు తెలియజేశాడు ప్రకాష్.
అయితే ఇక్కడ ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పోలీసులు కూడా ఈ కేసుని కేవలం ప్రకాష్ చెప్పిన స్టేట్మెంట్ నుంచే కాకుండా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ చుట్టూ పక్కల గ్రామస్థులను, అక్కడి సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు.