Rashmika Mandanna: ఐటెం సాంగ్ క్రేజ్.. రష్మిక కూడా ఒకే చెప్పేసిందా?

ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, ఎన్ని కోట్ల బడ్జెట్ ఉన్నా.. వాటన్నింటినీ మించి డామినేట్ చేసేది.. సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యేది స్పెషల్ సాంగ్ అని స్టైల్ గా పిలుచుకునే ఐటమ్..

Rashmika Mandanna: ఐటెం సాంగ్ క్రేజ్.. రష్మిక కూడా ఒకే చెప్పేసిందా?

Rashmika Mandanna

Rashmika Mandanna: ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, ఎన్ని కోట్ల బడ్జెట్ ఉన్నా.. వాటన్నింటినీ మించి డామినేట్ చేసేది.. సినిమాకే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యేది స్పెషల్ సాంగ్ అని స్టైల్ గా పిలుచుకునే ఐటమ్ సాంగ్. ఈమధ్య సినిమాల్లో స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చెయ్యడంతో సినిమా లుక్కే మారిపోతోంది. అంతే కాదు.. జనాలకు కూడా ఎక్స్ పెక్ట్ చేసినంత కిక్కిస్తోంది. సినిమాకు హీరో, హీరోయిన్లతో పాటు.. స్పెషల్ సాంగ్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

Rashmika Mandanna : ఇంకో జన్మ ఉంటే మగాడిగా పుట్టాలనుకుంటున్నా..

ఈమధ్య ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ పెరగడంతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి కిక్కెక్కించే స్పెషల్ సాంగ్స్ తో సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇది టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలలో ఉన్నదే. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ అంతా ఇప్పటికే ఈ ఐటమ్స్ సాంగ్స్ లో స్టెప్పులేసి పిప్పి చేయగా మన టాలీవుడ్ లో కూడా.. జనతా గ్యారేజ్ లో కాజల్, పుష్పలో సమంత, గనిలో తమన్నా,ఆచార్యలో రెజీనా స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించారు.

Item Songs: ఐటెం సాంగ్ ఉందా.. ఊ ఊ అనేదే లేదంటున్న స్టార్ హీరోయిన్స్!

ఇక ఇప్పుడు నేషన్ క్రష్ రష్మిక వంతు వచ్చింది. రష్మికకు ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అఫర్ వచ్చిందట. అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించి, అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ వంగా.. ఇప్పుడు రణబీర్ కపూర్ తో ఓ మూవీ తెరకెక్కిస్తున్నాడు. పరిణీతి చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ కాగా.. ఓ స్పెషల్ సాంగ్ కోసం రష్మికను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారట. హిందీలో ఇప్పటికే పుష్పతో స్టార్ హీరోయిన్ గా మారి నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక ఇప్పుడు అక్కడ వరస సినిమాలు విడుదల కానున్నాయి. ఇక.. ఇలా స్పెషల్ సాంగ్ లో కూడా దుమ్ము రేపితే ఈ కన్నడ సుందరి జోష్ ఆపడం సాధ్యం కాదేమో!